Begin typing your search above and press return to search.

పవన్ డైరెక్టర్.. లిస్టులోకి మరో యువ హీరో!

ఈ మూవీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయనున్నాడు.

By:  Tupaki Desk   |   16 May 2024 4:44 AM GMT
పవన్ డైరెక్టర్.. లిస్టులోకి మరో యువ హీరో!
X

కమర్షియల్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మిస్టర్ బచ్చన్ సినిమాని నిర్మిస్తోంది. ఈ మూవీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయనున్నాడు.


ఈ ఏడాదిలోనే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని హరీష్ శంకర్ అనుకుంటున్నారు. అయితే పవన్ బిజీగా ఉండడం వల్ల సినిమా ఎప్పటికి ఫినిష్ అవుతుంది అనే విషయంలో అసలు క్లారిటీ రావడం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు హరీష్ శంకర్ హీరోల జాబితాలో మరో హీరో కూడా చేరినట్లు తెలుస్తోంది.

అతను మరెవరో కాదు రామ్ పోతినేని అని టాక్. రామ్ పోతినేని ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. మే 15న డబుల్ ఇస్మార్ట్ టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. అయితే దీనికి చెప్పుకోదగ్గ రెస్పాన్స్ అయితే పబ్లిక్ నుంచి రాలేదు.

ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమాలంటే పబ్లిక్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్, హైప్ డబుల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్ సందర్భంగా కనిపించలేదు. ఈ సినిమాతో ఇటు రామ్ పోతినేని, అటు పూరి జగన్నాథ్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. ఇద్దరికి ఈ మూవీ చాలా కీలకంగా మారింది. డబుల్ ఇస్మార్ట్ తర్వాత రామ్ పోతినేని ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనే ప్రశ్న మొన్నటి వరకు వినిపించింది.

ఇప్పుడు దాదాపుగా రామ్ పోతినేని చేయబోయే నెక్స్ట్ మూవీ దర్శకుడిగా హరీష్ శంకర్ ఖరారు అయినట్లేనని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇప్పటికే హరీష్ రామ్ పోతినేనికి కథ నేరేట్ చేసి ఒకే చేయించుకున్నాడని టాక్. అరుణాచల్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుందంట. ఈ బ్యానర్ లో తాజాగా కృష్ణమ్మ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఇంకా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకోలేదు. కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అరుణాచల్ క్రియేషన్స్ లో ప్రొడక్షన్ నెంబర్ 2గా రామ్, హరీష్ కాంబినేషన్ మూవీ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.