Begin typing your search above and press return to search.

మహారాజా కి మిలియన్ కృతజ్ఞతలు

మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దండయాత్ర కొనసాగిస్తూనే ఉన్నాడు

By:  Tupaki Desk   |   11 Feb 2024 4:54 AM GMT
మహారాజా కి మిలియన్ కృతజ్ఞతలు
X

మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దండయాత్ర కొనసాగిస్తూనే ఉన్నాడు. రెండు రోజుల క్రితం ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ మరో వైపు మిస్టర్ బచ్చన్ సినిమాతో రెడీ అవుతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.


మిరపకాయ్ సినిమాతో వీరిద్దరు హిట్ కాంబోగా నిలిచిన విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా మాస్ రాజా మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఒక వైపు ఈగల్‌ మూవీ ప్రమోషన్ లో పాల్గొంటూ మరో వైపు మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్‌ లోనూ పాల్గొన్నాడు.

తాజాగా సినిమా షెడ్యూల్‌ ముగిసిన సందర్భంగా రవితేజ ఎక్స్ ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. దాంతో పాటు మరో అందమైన షెడ్యూల్‌ ను విజయవంతంగా పూర్తి చేశాం. సినిమాటోగ్రాఫర్‌ కి హరీష్ కృతజ్ఞతలు తెలియజేశాడు. రవితేజ 24 గంటలు పని చేయడం వల్లే ఇది సాధ్యం అయ్యింది. మాస్ రాజా కి మిలియన్‌ కృతజ్ఞతలు అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు.

ఈ సినిమా బాలీవుడ్ సూపర్‌ హిట్‌ మూవీకి రీమేక్‌ అనే విషయం తెల్సిందే. రవితేజ బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుచుతున్న ఈ సమయంలో మిస్టర్ బచ్చన్ పై ఫ్యాన్స్‌ చాలా ఆశలు పెట్టుకున్నారు. వీరి కాంబోలో సినిమా కోసం సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి కన్నుల పండుగ ఖాయం అనిపిస్తుంది.