Begin typing your search above and press return to search.

రిజెక్ట్ చేసిన హీరోయిన్స్.. హరీష్ శంకర్ ఏమన్నారంటే..

అలా వైరల్ అయిన ఓ ట్వీట్ పై హరీశ్ శంకర్ ఘాటుగా స్పందించారు. ఆ ట్వీట్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే?

By:  Tupaki Desk   |   15 Dec 2023 5:16 PM GMT
రిజెక్ట్ చేసిన హీరోయిన్స్.. హరీష్ శంకర్ ఏమన్నారంటే..
X

మాస్ మహారాజా రవితేజ- స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో ఇటీవలే ఓ సినిమా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. గతంలో వీరి కలయికలో షాక్, మిరపకాయ్ సినిమాలు వచ్చాయి. ఇక మళ్ళీ ఇన్నాళ్లకు ఓ రీమేక్ తో రాబోతున్నారు. బాలీవుడ్ మూవీ రైడ్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రవితేజ లుక్ టెస్ట్ కూడా జరిగింది. అయితే త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడున్నాయి.

అలా వైరల్ అయిన ఓ ట్వీట్ పై హరీశ్ శంకర్ ఘాటుగా స్పందించారు. ఆ ట్వీట్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే? "రవితేజ- హరీశ్ శంకర్ సినిమాను ఇద్దరు హీరోయిన్లను అనుకోగా. అందులో మొదట మీనాక్షి చౌదరీని మేకర్స్ సంప్రదించారట. కానీ డేట్స్ విషయంలో సమస్యల కారణంగా మీనాక్షి నో చెప్పేసిందని. మేకర్స్ చెప్పిన రెమ్యునరేషన్ నచ్చక సీనియర్ బ్యూటీ ఇలియానా కూడా నో చెప్పిందని వార్తలు అల్లెస్తున్నారు. ఇక తాజాగా చిత్రబృందం యానిమల్లో యాక్ట్ చేసిన బోల్డ్ బ్యూటీ తృప్తిని తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారని కూడా.. పలు ట్వీట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఇక డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆ ట్వీట్లపై స్పందించారు. "ఇది పూర్తిగా అవాస్తవం. శృతి హాసన్‌ లేదా పూజాహెగ్డే.. నా ట్రాక్‌ రికార్డ్‌ తెలిసిన వారందరికీ హరీశ్ శంకర్ ఎంపికపై చాలా నమ్మకం ఉంది. ఇలాంటి పుకార్లను ఎవరూ స్ప్రెడ్ చేయొద్దు. యానిమల్ మూవీ కన్నా ముందే నా మూవీ క్యాస్టింగ్ కంప్లీట్ అయింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్నే అడగండి. క్లియర్ చేస్తా" అంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా క్లారిటీ ఇచ్చారు.

2018లో అజయ్ దేవగణ్, ఇలియానా నటించి హిందీ సూపర్ హిట్ అయిన రైడ్‌ మూవీ రీమేక్‌ గా ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒక ఊరిలో కోట్ల రూపాయల అక్రమాస్తులు, బ్లాక్ మనీ, అక్రమంగా సంపాదించుకుని దోచుకున్న పెద్దమనిషి ఇంటి మీదకు రైడింగ్ కు వెళ్లే ఓ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ స్టోరీ ఇది.

ఇప్పుడు మరి హరీశ్ శంకర్.. రైడ్ మూవీని అలా యాజ్ టీజ్ రీమేక్ చేస్తారా లేక ఇక్కడ హీరోలకు అనుగుణంగా ఛేంజ్ చేస్తారోనని ఫ్యాన్స్ అంటున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఈ మూవీని నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మరోవైపు హరీష్ స్టార్ట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ హోల్డ్ లో పెట్టిన విషయం తెలిసిందే.