Begin typing your search above and press return to search.

హరీష్ శంకర్ లిస్టులో.. మరో ఇద్దరు మాస్ హీరోలు

కమర్షియల్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని హరీష్ శంకర్ సొంతం చేసుకున్నాడు

By:  Tupaki Desk   |   12 Feb 2024 3:59 AM GMT
హరీష్ శంకర్ లిస్టులో.. మరో ఇద్దరు మాస్ హీరోలు
X

కమర్షియల్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని హరీష్ శంకర్ సొంతం చేసుకున్నాడు. చివరిగా హరీష్ శంకర్ నుంచి గద్దలకొండ గణేష్ వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తరువాత పవన్ కళ్యాణ్ తో గత ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ స్టార్ట్ చేశాడు. ఈ మూవీ 30 శాతం షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యిందంట.

అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికలలో బిజీగా ఉండటంతో కొన్ని నెలలు షూటింగ్ లకి విరామం ఇచ్చారు. ఈ టైంలో రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాని హరీష్ శంకర్ స్టార్ట్ చేశాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హిందీ రైడ్ మూవీకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రవితేజ స్టైల్ కామెడీతో పాటు కావాల్సినంత యాక్షన్ సీక్వెన్స్ కూడా మూవీలో ఉంటాయంట.

ఈ రెండు సెట్స్ పైన ఉండగానే మరో రెండు ప్రాజెక్ట్స్ ని హరీష్ శంకర్ ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో బాలకృష్ణ హీరోగా ఓ మూవీ ఉండబోతోంది. ఈ సినిమా బాలయ్య స్టైల్ లోనే ఉండబోతోందని టాక్. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. తరువాత బోయపాటితో అఖండ చేయనున్నాడు.

ఈ రెండు కంప్లీట్ అయ్యాక హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ఉంటుందంట. మరో వైపు మెగాస్టార్ చిరంజీవికి అదిరిపోయే కథ ఒకటి వినిపించి ఒకే చేయించున్నాడంట. ఈ సినిమా కూడా త్వరలో ఎనౌన్స్ ఉంటుందని తెలుస్తోంది. హరీష్ శంకర్ కూడా రెండు ప్రాజెక్ట్స్ ఎనౌన్సమెంట్ కి రెడీగా ఉన్నాయని ఈగల్ సక్సెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చాడు.

ఆ రెండు సినిమాలు బాలయ్య, మెగాస్టార్ చిరంజీవిలతో చేయబోయేవి అని తెలుస్తోంది. వీటిలో ఏది మొదటిగా స్టార్ట్ చేస్తాడు అనేది చూడాలి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీని తర్వాత హరీష్ శంకర్ సినిమా ఉండొచ్చని టాక్.