Begin typing your search above and press return to search.

ఈ మాస్ డైరెక్టర్ లక్కుకు లెక్కే లేదు!

ప్రతి రెండేళ్లకి ఒక సినిమాతో హరీష్ శంకర్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఒక్క రామయ్యా వస్తావయ్యా తప్ప మిగిలిన మూడు సినిమాలు మినిమమ్ హిట్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   4 April 2024 4:34 AM GMT
ఈ మాస్ డైరెక్టర్ లక్కుకు లెక్కే లేదు!
X

టాలీవుడ్ లో మాస్ కమర్షియల్ డైరెక్టర్ గా హరీష్ శంకర్ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. గబ్బర్ సింగ్ తో స్టార్ డైరెక్టర్ అయిపోయిన హరీష్ శంకర్ 2006లో షాక్ సినిమాతో దర్శకుడిగా తన కెరియర్ స్టార్ట్ చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఐదేళ్ల గ్యాప్ తర్వాత మాస్ మహారాజ్ రవితేజతో మిరపకాయ్ అనే మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

వెంటనే పవన్ కళ్యాణ్ పిలిచి గబ్బర్ సింగ్ మూవీ అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో హరీష్ శంకర్ అద్భుతంగా ప్రూవ్ చేసుకొని పవన్ కళ్యాణ్ కి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చాడు. రీమేక్ మూవీ అయిన తెలుగు నేటివిటీకి, పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సరిపోయే విధంగా ప్రెజెంట్ చేసి హరీష్ శంకర్ సక్సెస్ అయ్యాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది.

ప్రతి రెండేళ్లకి ఒక సినిమాతో హరీష్ శంకర్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఒక్క రామయ్యా వస్తావయ్యా తప్ప మిగిలిన మూడు సినిమాలు మినిమమ్ హిట్ అయ్యాయి. చివరిగా వరుణ్ తేజ్ తో 2019లో గడ్డలకొండ గణేష్ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని హరీష్ శంకర్ అందుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ కోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తూ వచ్చాడు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ డేట్స్ సెట్ ఇవ్వడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని గత ఏడాది సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు. ఆ మూవీ మళ్ళీ వాయిదా పడింది.

ఈ సారి గ్యాప్ తీసుకోవడానికి హరీష్ సిద్ధంగా లేకపోవడంతో రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ స్టార్ట్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాది ఆఖరుకి ఫినిష్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. వీటి తర్వాత వచ్చే ఏడాది బాలయ్యతో భారీ బడ్జెట్ సినిమాని హరీష్ శంకర్ చేయనున్నాడు. ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమాకి సిద్ధంగా ఉన్నారు. అది కంప్లీట్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవితో పెద్ద సినిమా ఒకటి చేయనున్నాడు.

ఇలా బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోలతో హరీష్ శంకర్ మూవీస్ ని లైన్ లో పెట్టాడు. గద్దలకొండ గణేష్ తర్వాత ఐదేళ్లు గ్యాప్ వచ్చిన హరీష్ శంకర్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు హరీష్ శంకర్ తో సినిమాలు చేయడానికి అడ్వాన్స్ లు తీసుకున్నాడు. ఈ కారణంగానే హరీష్ ఆదాయానికి ఎలాంటి డోకా లేకుండా ఉందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు లేట్ అయిన కూడా సక్సెస్ లు అందుకోవడం ఖాయం అనే కాన్ఫిడెంట్ తో నిర్మాతలు ఉండటానికి కారణం హరీష్ శంకర్ ట్రాక్ రికార్డ్ అనే మాట వినిపిస్తోంది.