Begin typing your search above and press return to search.

ఉస్తాద్ భగత్ సింగ్.. అంచనాలకు మించి..!

ఈ సినిమా విషయంలో హరీష్ శంకర్ చాలా ఫోకస్డ్ గా ఉన్నారు. సినిమా గురించి హరీష్ శంకర్ ఫ్యాన్స్ తో స్పెషల్ చిట్ చాట్ చేశారు.

By:  Tupaki Desk   |   24 Oct 2023 5:57 PM GMT
ఉస్తాద్ భగత్ సింగ్.. అంచనాలకు మించి..!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై తారా స్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. ఈ సినిమా విషయంలో హరీష్ శంకర్ చాలా ఫోకస్డ్ గా ఉన్నారు. సినిమా గురించి హరీష్ శంకర్ ఫ్యాన్స్ తో స్పెషల్ చిట్ చాట్ చేశారు.

ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు తన కెరీర్ ప్లానింగ్ లో కూడా చేశాడు హరీష్ శంకర్. మల్టీస్టారర్ సినిమా తీస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ సినిమా కంటే ఓజీ ముందు వస్తే దానికి అంచనాలు పెరుగుతాయంటారా అంటే.. సినిమాలు రిలీజ్ అవ్వడం పోటీ కాదు. అందరికీ అది ఒక వేడుకతో సమానమని అన్నారు.

టాలీవుడ్ కంటే కోలీవుడ్ లో మంచి సినిమాలు వస్తున్నాయంటారా అంటే దేశమంతా తెలుగు పరిశ్రమ వైపు చూస్తుంది. తమిళ ఆడియన్స్ కూడా వాళ్ల సినిమాలను ఎంతో గౌరవిస్తున్నారని అన్నారు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేకా కాదా..? అన్న ప్రశ్నకు సమాధానంగా నాపై నమ్మకం ఉంచండి.. మీ ఎదురుచూపులకు తగ్గట్టుగా సినిమా ఉంటుందని అన్నారు. మీరు ఎంత భారీగా అంచనాలు పెట్టుకున్నా వాటిని ఈ సినిమా కచ్చితంగా అందుకుంటుందని అన్నారు.

మీ సినిమాలు రీమేక్ లుగా ఉంటాయని టాక్ ఉంది. మీరు కాపీ కంటెంట్ వాడుతారా అంటే.. ఆనికి సమాధానంగా నా వర్క్ నిజంగా తెలిసిన వారు అయితే వాటిని రీమేక్ లు అని పిలవడానికి సిగ్గు పడతారని అన్నారు. నా పనికి నేనెప్పుడూ గర్వపడతానని.. విమర్శించే వారు ఉన్నప్పుడే మనం ఇంకా బాగా ప్రయత్నిస్తానని అన్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ కూడా గబ్బర్ సింగ్ రేంజ్ లో ఉంటుందా అంటే.. పనిచేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది ఫలితం కాదని అన్నారు. దాన్ని మించి ఉండాలని కోరుకుందామని అన్నారు హరీష్ శంకర్. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అని నెటిజెన్ అడిగితే.. కచ్చితంగా చూడొచ్చు. ఇది యూత్ మాస్ ఆడియన్స్ కు కూడా నచ్చుతుందని అన్నారు. ఇలాంటి సినిమా తీస్తున్నప్పుడు ఒత్తిడికి గురవుతారా అంటే అది ఎప్పుడూ ఉంటుంది కానీ దాన్ని జయించాలని అన్నారు. భవిష్యత్తులో మానవ సంబంధాలు, లవ్ స్టోరీ సినిమాలు చేస్తానని అన్నారు హరీష్ శంకర్.