Begin typing your search above and press return to search.

హరీశ్ శంకర్ మంచి మనసు... ప్రశంసిస్తున్న నెటిజన్లు!

అవును... హైదరాబాద్ లో నడిరోడ్డుపై ఎవరిదో కారు నిలిచిపోయింది. ఈ సమయంలో దానివల్ల తీవ్రస్థాయిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   14 March 2024 1:25 PM IST
హరీశ్  శంకర్  మంచి మనసు... ప్రశంసిస్తున్న నెటిజన్లు!
X

టాలీవుడ్ సినీ దర్శకుల్లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారిలో హరీశ్ శంకర్ ఒకరు. ప్రధానంగా సినిమాలపైనే కాకుండా... పలు సమాజిక అంశాలపైనా ఆయన తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబుతారనే పేరుంది! ఇదే సమయంలో ఇతరులకు సాయం చేసే విషయంలో కూడా హరీశ్ శంకర్ ముందుంటారని చెబుతుంటారు. ఈ సమయంలో నడిరోడ్డుపై కారు గెంటుతూ కనిపించారు డైరెక్టర్ హరీశ్ శంకర్.

అవును... హైదరాబాద్ లో నడిరోడ్డుపై ఎవరిదో కారు నిలిచిపోయింది. ఈ సమయంలో దానివల్ల తీవ్రస్థాయిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో నడిరోడ్డుపై ఆగిన కారును డైరెక్టర్ హరీశ్ శంకర్ తో పాటు మైత్రీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ తో కలిసి ఆ కారును కొంతదూరంపాటు నెట్టుకుంటూ వెళ్లారు. దీంతో ఈ విషయాన్ని గమనించిన కొంతమంది... వీరికి తోడుగా కదిలారు.

ఈ సమయంలో ఈ సంఘటనను కొంతమంది వీడియో తీసి నెట్టింట వదిలారు. దీంతో... ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. డైరెక్టర్ హరీశ్ శంకర్ పై ఈ సందర్భంగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిర్మాత అయ్యుండి కూడా రవిశంకర్ సింప్లిసిటీ సూపర్బ్ అంటూ ఆయనను కొనియాడుతున్నారు.

ఇక ప్రస్తుతం హరీశ్ శంకర్ చేస్తున్న సినిమాల విషయానికొస్తే... రవితేజ హీరోగా ఈయన దర్శకత్వంలో "మిస్టర్ బచ్చన్" పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హిందీలో సక్సెస్ అయిన "రైడ్" మూవీకి ఇది రీమేక్ అని అంటున్నారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా "ఉస్తాద్ భగత్ సింగ్" ను హరీశ్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే!