Begin typing your search above and press return to search.

దమ్ముంటే ఫొటో వేసుకో.. హరీష్ శంకర్ ఫుల్ ఫైర్!

వాళ్లు గతంలో చేసిన కామెంట్స్ కూడా బయటకు తీసి కౌంటర్లు వేశారు హరీష్. చాలా ఆవేశంగా ఆ సైట్ పై ఫైర్ అయ్యారు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 4:44 AM GMT
దమ్ముంటే ఫొటో వేసుకో.. హరీష్ శంకర్ ఫుల్ ఫైర్!
X

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ఈగల్ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9వ తేదీన రిలీజై మంచి విజయం సాధించింది. ఒక మాస్ స్టైలిష్ యాక్షన్ సినిమాతో థియేటర్స్ లో అదరగొడుతున్నారు రవితేజ. ఇప్పటికే రెండు రోజుల్లోనే 10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ హరీష్ శంకర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

అయితే హరీష్ శంకర్ తన మనసులోని మాటలను వేదికలపై బహిరంగంగానే బయట పెడుతుంటారు. తాజాగా ఈగల్ సక్సెస్ మీట్‌ లో కూడా మరోసారి తన ఆవేదనను బయటపెట్టారు. ఓ గాసిప్ వెబ్ సైట్‌ పై హరీష్ శంకర్ ఫైర్ అయ్యారు. ఈగల్ సినిమాపై ఒక వెబ్ సైట్ నెగిటివ్ రివ్యూలు రాయడంతో పాటు, మూవీ యూనిట్ ను పర్సనల్ గా ట్రోల్ చేసింది. దీనిపై ఆల్రెడీ నిర్మాణ సంస్థ కౌంటర్ ఇచ్చింది. తాజాగా ఆ సైట్ పై హరీష్ శంకర్ విరుచుకుపడ్డారు.

వాళ్లు గతంలో చేసిన కామెంట్స్ కూడా బయటకు తీసి కౌంటర్లు వేశారు హరీష్. చాలా ఆవేశంగా ఆ సైట్ పై ఫైర్ అయ్యారు. "ఓ వెబ్ సైట్ మరీ దారుణంగా పర్సనల్ టార్గెట్ చేస్తోంది. ఓ డైరెక్టర్ నాలుగేళ్లుగా సినిమా తీయట్లేదు. రాత్రంతా తాగుతూ ఉన్నారు. గతంలో పవన్ కల్యాణ్‌ తో బ్లాక్ బస్టర్ తీశాడు అని రాస్తారు. ఫొటో వేయరు. నా ఫొటో, పేరు రాసే ధైర్యం లేదు. ధైర్యం ఉంటే నా ఫొటో వేసి రాయండి. నేను కౌంటర్ ఇస్తాను. నువ్వేమైనా నాకు పెగ్గు కలిపావా. ఐస్ వేశావా. నీకు తెలుసా. మనం ఒకే జట్టుగా ఉన్నాం. మీరు ఆ గట్టు మీద, మేం ఈ గట్టు మీద లేం" అని హరీష్ శంకర్ అన్నారు.

అన్ని వెబ్ సైట్లకు కాదు.. ఆ ఒక్క వెబ్ సైట్ కు మాత్రమే చెబుతున్నానంటూ హరీష్ శంకర్ ఆవేశంలో కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రొడ్యూసర్లను కాపాడుకోవాలని వారి వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. సేవ్ ది టైగర్స్ కాదు.. సేవ్ ది ప్రొడ్యూసర్స్ అని అన్నారు. అయినా నాలుగేళ్లు కాకపోతే ఐదేళ్లు ఆలస్యంగా వస్తుంది మీకేంటి అంటూ ప్రశ్నించారు. విపరీతంగా పర్సనల్ అటాక్ చేస్తున్నారని.. అది సరైన పద్ధతి కాదని చెప్పుకొచ్చారు.

అయినా ట్రోలింగ్స్ చూసే తాము ఈ స్థితికి చేరుకున్నామని హరీష్ తెలిపారు. మొదట సినిమాలు చేస్తామని ఇంట్లో చెప్పినప్పుడు తల్లిదండ్రుల నుంచే ట్రోలింగ్ స్టార్ అయిందని వివరించారు. ఆ తర్వాత బంధువులు, స్నేహితులు చాలా మంది ట్రోల్స్ చేశారని.. ఇప్పటికైనా మీరు ఇది ఆపితే బాగుంటుందని అన్నారు. లేదు.. ఇలానే నెగెటివ్ ఆర్టికల్స్ రాస్తామంటే రాసుకోండి.. మీ అభిమాన హీరో చెప్పిన డైలాగ్, చేసిన సింబల్ గుర్తుంది కదా అంటూ సైగలు చేశారు హరీష్ శంకర్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.