భక్తిలో బాలయ్యని ఫాలో అవుతున్నాడా?
తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఇదే తరహాలో శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 Jun 2025 12:47 PM ISTకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అన్నది అందరికీ ఎంతో అద్భుతమైన విషయం. సెలబ్రిటీలైతే ఎప్పటికప్పుడు స్వామి వారి ఆశిస్సులు తీసుకుంటారు. ప్రముఖంగా సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయితే మాత్రం ఆ మొక్కును వెంటనే చెల్లిస్తారు. అందులో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించరు. సక్సెస్ అయిన సంతోషంలో చాలా మంది సెలబ్రిటీలు చేసే పనే.
మాలీవుడ్ నుంచి తప్ప మిగతా అన్ని పరిశ్రమల హీరోలు శ్రీవారిని తప్పక దర్శించుకుంటారు. శ్రీవారు తర్వాత విశాఖ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకోవడం చాలా మంది కి అలవాటు. బాలకృష్ణకు అప్పన్న స్వామి అంటే ఓ సెంటిమెంట్. తన సినిమా రిలీజ్ కు ముందే అప్పన్న స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. అనుకున్న ట్లుగానే ఆ సినిమా మంచి విజయం సాధిస్తుంది.
తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఇదే తరహాలో శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో `ఉస్తాద్ భగత్ సింగ్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. పవన్ డేట్లు ఇవ్వకపోవడంతో ఎక్కడ షూటింగ్ అక్కడ నిలిచిపోయింది. ఇటీవలే మళ్లీ డేట్లు ఇచ్చారు. దీంతో హరీష్ శంకర్ సినిమా విజయవంతంగా పూర్తి చేయాలని శ్రీవారిని కోరుకున్నారు.
ఇది సాధారణ యాత్ర కాదు. భక్తితో కూడిన మాస్ యాత్ర. ఎందుకంటే ఈసారి ఆయన దర్శకత్వం వహించ బోయేది తన దేవుడు పవర్ స్టార్ ని అంటూ సోషల్ మీడియా పోస్టులు వైరల్ గా మారాయి. ప్రస్తుతం హరీష్ శంకర్ వరుస ప్లాప్ ల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికిప్పుడు ఆయనకు హిట్ తప్పనిసరి. దీంతో అతడి ఆశలన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ పైనే ఉన్నాయి.
