హరీష్ శంకర్ కు మహేష్ దొరకాలంటే?
టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హరీష్ శంకర్. అయితే ఆయన మనసులో చాలా కాలంగా ఒక బలమైన కోరిక ఉంది.
By: Tupaki Desk | 17 March 2026 7:00 AM ISTటాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హరీష్ శంకర్. అయితే ఆయన మనసులో చాలా కాలంగా ఒక బలమైన కోరిక ఉంది. తాజాగా కోరిక బయట పడింది. సూపర్ స్టార్ మహేష్ ను డైరెక్ట్ చేయాలని చాలా కాలంగా హరీష్ శంకర్ అనుకుంటున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. ఇప్పటికే మహేష్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్దంచేసి పెట్టుకున్నాడుట. కానీ టాలీవుడ్‌లో ఒక స్టార్ హీరోను ఒప్పించడం అందులోనూ మహేష్ లాంటి సెలెక్టివ్ హీరోతో ప్రాజెక్ట్ ఓకే చేయించుకోవడం అనుకున్నంత అంత సులభం కాదనేది అంతే వాస్తవం.
మహేష్ తో సినిమా చేయాలంటే కేవలం మంచి కథ ఉంటే సరిపోదు. దర్శకుడి ట్రాక్ రికార్డ్ కూడా ఎంతో కీలకం. ప్రస్తుతం మహేష్ గ్లోబల్ స్థాయిలో రాజమౌళి వంటి దర్శకులతో పని చేస్తూ తన మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో హరీష్ శంకర్ మహేష్ దృష్టిని ఆకర్షించాలంటే? బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకోవాల్సి ఉంటుంది. గతంలో `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత ఆ రేంజ్క హిట్ పమళ్లీ పడలేదు. అందులోనూ ఇటీవల ఆయన చేసిన చాలా సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.
దీంతో హరీష్ శంకర్ ఆశలన్నీ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న `ఉస్తాద్ భగత్ సింగ్` పైనే ఉన్నాయి. ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ హరీష్ శంకర్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటే గనుక మళ్ళీ హరీష్ పేరు మారుమోగిపోతుంది. కమర్శియల్ డైరెక్టర్ కాబట్టి ఎంత పెద్ద స్టార్ అయినా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అంతే కాదు ఈ సినిమా విజయం హరీష్ కు కీలకం. భారీ హిట్లు ఉన్నా? స్టార్ హీరోలంతా బిజీగా ఉండటంతో? హిట్ డైరెక్టర్లు కూడా ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ఇక మహేష్ విషయానికి వస్తే?
తన దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిస్తారు. కానీ ఆ దర్శకుడు తనను కొత్తగా ప్రెజెంట్ చేస్తాడనే నమ్మకం కలగాలి. హరీష్ శంకర్ డైలాగులు, హీరో ఎలివేషన్లు మహేష్ పర్సనాలిటీకి సరిగ్గా సెట్ అవుతాయి. అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ ఇమేజ్ మరో లెవల్‌కు వెళ్తుంది. కాబట్టి హరీష్ శంకర్ తన కథను మరింత ఉన్నతంగా, పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేయాల్సి ఉంటుంది. `ఉస్తాద్ భగత్ సింగ్` విజయం హరీష్‌కు ఆ నమ్మకాన్ని, బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉస్తాద్ రిలీజ్ తర్వాతే కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడు తానని..అంతవరకూ మరే సినిమా గురించి మాట్లాడనని హరీష్ కూడా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
