Begin typing your search above and press return to search.

వీరమల్లు టీజర్‌... ఒక్కడు ఎందుకు వచ్చాడు?

తెలుగు సినిమా ప్రేక్షకులకు చార్మినార్‌ అనగానే మహేష్ బాబు ఒక్కడు సినిమా గుర్తుకు వస్తుంది.

By:  Tupaki Desk   |   3 May 2024 6:52 AM GMT
వీరమల్లు టీజర్‌... ఒక్కడు ఎందుకు వచ్చాడు?
X

పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న హరి హర వీరమల్లు సినిమా రెండు పార్ట్‌ లుగా రాబోతుంది అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. అంతే కాకుండా మొదటి పార్ట్‌ కి సంబంధించిన టీజర్ ను విడుదల చేయడంతో పాటు ఇదే ఏడాదిలో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.

ఇన్ని రోజులు జరుగుతున్న ప్రచారంకు, సినిమా కాన్సెప్ట్‌ గురించి జనాల్లో ఉన్న అపోహలకు అన్నింటికి స్వస్థి చెబుతూ టీజర్ లో క్లీయర్‌ గా సినిమా పాయింట్‌ ను చూపించడం జరిగింది. హైదరాబాద్‌ నైజాం నవాబ్‌ నుంచి దోచి ప్రజలకు పంచిపెట్టే వీరమల్లు కథతో ఈ సినిమా రూపొందింది.

ఒక వైపు వీరమల్లు టీజర్‌ మరియు అందులోని పిక్స్ షేర్‌ అవుతున్న సమయంలో మరో వైపు మహేష్ బాబు ఒక్కడు సినిమాతో ఈ సినిమాను పోల్చుతూ ఒక సెంటిమెంట్‌ ను ప్రస్థావిస్తూ సినిమా హిట్ ఖాయం అంటూ కొందరు సోషల్‌ మీడియా ద్వారా తెగ ప్రచారం చేస్తున్నారు.

అసలు విషయం ఏంటి అంటే హరి హర వీరమల్లు సినిమా టీజర్‌ ను చూస్తే అందులో పవన్‌ కళ్యాణ్‌ ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చార్మినార్‌ సెట్‌ లో చేసినట్లుగా చూపించారు. అంతే కాకుండా చార్మినార్‌ ను బ్యాక్ గ్రౌండ్‌ లో చూపిస్తూ పవన్‌ ను చూపించారు. మొత్తంగా చార్మినార్‌ ను ఈ సినిమాలో కీలకంగా చూపించబోతున్నారు.

తెలుగు సినిమా ప్రేక్షకులకు చార్మినార్‌ అనగానే మహేష్ బాబు ఒక్కడు సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా కథ లో ఎక్కువ సన్నివేశాలు చార్మినార్ లో చిత్రీకరించడం జరిగింది. అప్పట్లోనే కోటి రూపాయల ఖర్చుతో చార్మినార్‌ సెట్‌ ను దర్శకుడు గుణశేఖర్‌ నిర్మించి అందరిని సర్‌ప్రైజ్ చేశాడు.

చార్మినార్‌ బ్యాక్‌డ్రాప్ తో వచ్చిన ఒక్కడు మాదిరిగానే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కూడా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు మరియు నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇరవై ఏళ్ల ఒక్కడును వీరమల్లుతో ముడి పెట్టి నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.