Begin typing your search above and press return to search.

వీరమల్లు సందడి మళ్లీ షురూ అవ్వనుందా...?

దాంతో ఇప్పటికే ప్రారంభం అయిన హరి హర వీరమల్లు, ఓజీ మరియు ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలు ఆగిపోయాయి.

By:  Tupaki Desk   |   9 March 2024 8:19 AM GMT
వీరమల్లు సందడి మళ్లీ షురూ అవ్వనుందా...?
X

పవన్ కళ్యాణ్ త్వరలో జరగబోతున్న ఏపీ ఎన్నికల హడావుడి లో ఉన్న విషయం తెల్సిందే. గత కొన్ని నెలలుగా షూటింగ్స్ కు పూర్తి దూరంగా ఉంటు రాజకీయాలపై పవన్ దృష్టి పెట్టాడు. దాంతో ఇప్పటికే ప్రారంభం అయిన హరి హర వీరమల్లు, ఓజీ మరియు ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలు ఆగిపోయాయి.

మొన్నటి వరకు ఓజీ సినిమా షూటింగ్‌ పవన్‌ లేకుండానే జరుగుతుందనే ప్రచారం జరిగింది. కానీ ఉస్తాద్‌ భగత్‌ సింగ్ మరియు హరి హర వీరమల్లు సినిమాల సందడి మాత్రం లేదు. ఉస్తాద్‌ భగత్‌ సింగ్ దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఇప్పటికే మరో సినిమాను మొదలు పెట్టాడు. హరి హర వీరమల్లు సినిమా దర్శకుడు క్రిష్ కూడా వేరే ప్రాజెక్ట్‌ లతో బిజీగా ఉన్నాడు.

ఈ మూడు సినిమాల్లో కూడా కదలిక ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే అన్నట్టుగా అంతా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో హరి హర వీరమల్లు సినిమా నుంచి టీజర్ రాబోతుందనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. షూటింగ్‌ ఇంకా చాలా బ్యాలన్స్ ఉంది. పవన్‌ ఎప్పుడు డేట్లు ఇచ్చేది క్లారిటీ లేదు. అయినా కూడా టీజర్ ను రెడీ చేస్తున్నారట.

సోషల్ మీడియా మరియు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు శివరాత్రి కే వీరమల్లు సినిమా అప్డేట్ ఇవ్వాలని భావించినా కూడా అది సాధ్యం కాలేదు. కానీ త్వరలోనే ఒక మంచి సందర్భంలో టీజర్ ను ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

క్రిష్ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడని, ఎన్నికలు పూర్తి అయిన వెంటనే పవన్‌ కళ్యాణ్ మొదట ఇచ్చే డేట్లతో హరి హర వీరమల్లు షూటింగ్‌ పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాది చివరి వరకు వీరమల్లు విడుదల చేయాలని క్రిష్ భావిస్తున్నాడట. అందుకే వీరమల్లు సందడి మళ్లీ షురూ చేసే ప్లాన్‌ చేస్తున్నారు.