Begin typing your search above and press return to search.

హరిహర వీరమల్లు.. ఈసారైనా క్లారిటీ వచ్చేనా?

అయితే మరి పవన్ నటిస్తున్న హరి హరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల పరిస్థితేంటి అనే అనుమానం అభిమానుల్లో ఉంది

By:  Tupaki Desk   |   1 Sep 2023 10:25 AM GMT
హరిహర వీరమల్లు.. ఈసారైనా క్లారిటీ వచ్చేనా?
X

మరో రోజులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటూ పండగ చేసుకునే రోజు. అదే సమయంలో ఆయన సినిమా అప్డేట్స్ కూడా వస్తాయని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఇప్పుటికే గ్యాంగ్ స్టర్ మూవీ ఓజీ అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసి వారిలో ఫుల్ జోష్ నింపింది.

అయితే మరి పవన్ నటిస్తున్న హరి హరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల పరిస్థితేంటి అనే అనుమానం అభిమానుల్లో ఉంది. ఇప్పటికే ఉస్తాద్ త్వరలోనే షూటింగ్ జరుపుకుంటుందని ఆ మధ్య ప్రచారం సాగింది. కానీ హరి హర వీరమల్లు మాత్రం ఒక్క అప్డేట్ కాదు కదా కనీసం ఎటువంటి ప్రచారం కూడా సాగట్లేదు. అసలీ చిత్రం ఏమై ఉంటుందనే ప్రశ్నల అభిమానుల మదిలో మెదులుతోంది.

కానీ ఇప్పుడా ప్రశ్నలకు సమాధానం దొరికే సమయం వచ్చినట్టు అనిపిస్తుంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం... పవన్ పుట్టినరోజు సందర్భంగా హరిహర వీరమల్లు నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ రానున్నట్లు తెలిసింది. ఈ రోజు అర్ధరాత్రి అంటే 12.17 నిమిషాలకు ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలిసింది.

దర్శకుడు క్రిష్ ఈ హరిహార వీరమల్లును మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా.. ఈ చిత్రం అభిమానుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లు దాటింది. కానీ ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. ఆలస్యమవుతూనే ఉంది.

అయితే ఇప్పుడు మాత్రం పవన్ కల్యాణ్ పుట్టినరోజున మాత్రం సరికొత్త పోస్టర్ ను బర్త్ డే కానుకగా రిలీజ్ చేయబోతున్నారట. మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి కథగా రానున్న చిత్రం.. అప్డేట్ తోనే సరిపెట్టుకుంటుందా లేదా సెట్స్ పైకి వెళ్తుందా అంటే దానికి సమాధానం దొరకలేదు. పవన్ పొలిటికల్ కెరీర్ పైనా దృష్టి పెట్టడం, ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఈ సినిమా పునఃప్రారంభమయ్యేది ఎలక్షన్స్ తర్వాతే అని అంటున్నారు. దీనిపై ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. చూడాలి మరి రేపు రిలీజ్ చేసే అప్డేట్ తో అయినా ఈ సినిమా షూటింగ్ పై క్లారిటీ వస్తుందో లేదో...

ఇకపోతే ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్ విర్క్, పూజిత పొన్నాడ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక పవన్ OG బర్త్ డే ట్రీట్ 10 : 35 నిమిషాలకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా ఏదైనా అప్డేట్ వస్తుందా లేదా అనేది చూడాలి.