Begin typing your search above and press return to search.

హరిహర వీరమల్లు.. ఇది గుడ్ న్యూసే..

పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయాలతో బిజీ కావడం వలన ఆ సినిమాకు బ్రేకులు పడుతూనే ఉన్నాయి

By:  Tupaki Desk   |   8 Aug 2023 4:59 AM GMT
హరిహర వీరమల్లు.. ఇది గుడ్ న్యూసే..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా కెరియర్లో మొదటిసారి ఒక డిఫరెంట్ హిస్టారికల్ కథను సెలెక్ట్ చేసుకోవడంతోనే అందరిని ఆశ్చర్యపరిచాడు. హరిహర వీరమల్లు సినిమాపై ఫ్యాన్స్ దృష్టి మరింత ఎక్కువగా పడింది. అందులోనూ టాలెంటెడ్ దర్శకుడు ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు అనగానే మార్కెట్లో కూడా ఆ సినిమాకు మంచి డిమాండ్ అయితే ఏర్పడింది.

మొదట పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను మొదలుపెట్టారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ టీజర్ కూడా పరవాలేదు అనే విధంగా ఆకట్టుకుంది. ఇక చార్మినార్ సెట్, అలాగే మరికొన్ని చారిత్రాత్మక నేపథ్యంలోనే కోటలు హైలైట్ అయ్యేలా సెట్లు కూడా వేశారు. ఇక మార్షల్ ఆర్ట్స్ లో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడం కూడా సినిమాపై ఎప్పటికప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అవుతూ వచ్చాయి.

కానీ పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయాలతో బిజీ కావడం వలన ఆ సినిమాకు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. అంతేకాకుండా మధ్యలో కొన్ని స్క్రిప్ట్స్ విషయంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు అని కూడా గాసిప్స్ అయితే వచ్చాయి. ఏదేమైనప్పటికీ కూడా సినిమా మేకింగ్ ఆలస్యం అవుతున్న కొద్ది నిర్మాత ఏం రత్నం కొంత ఆర్థికంగా కూడా ఇబ్బంది పడినట్లు టాక్ కూడా వచ్చింది.

సాధారణంగా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక నిర్మాత అంత భారీ బడ్జెట్ సినిమాను హ్యాండిల్ చేయడం అంటే రిస్కుతో కూడుకున్న పని. ఇక పవన్ బిజీ షెడ్యూల్ను అర్థం చేసుకుని అప్పటికి వాళ్ళు షూటింగ్స్ కొనసాగించినప్పటికీ అనుకున్న సమయానికి పనులు మాత్రం పూర్తి కావడం లేదు. అయితే ఈ సినిమా ఆగిపోవచ్చు అనే విధంగా కూడా అనుమానాలు వచ్చాయి.

ఇక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నిర్మాత ఏం రత్నం మాత్రం పవన్ కళ్యాణ్ తో చాలా పాజిటివ్ గానే ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన బ్రో సినిమా వేడుకలు పాల్గొనడం అలాగే భోళా శంకర్ ఈవెంట్లో కూడా ఒక అతిథిగా రావడంతో ఎక్కడ కూడా విభేదాలు లేవని, హరిహర వీరమల్లో ప్రస్తావన తీసుకురాక పోయినప్పటికీ కూడా ప్రాజెక్టు మాత్రం ఉంటుంది అనేలా సంకేతాలు అయితే ఇచ్చారు.

ప్రొడ్యూసర్ ఆ విధంగా ఉన్నప్పటికీ దర్శకుడు క్రిష్ మాత్రం ఎక్కడా కూడా బయట హరిహర వీరమల్లు గురించి పెద్దగా రియాక్ట్ అవడం లేదు. అంతేకాకుండా ఈ మధ్య ఆయన ఒక యువ హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో మరింత బిజీగా ఉన్నాడు. మరి హరిహర వీరమల్లో మళ్ళీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.