వీరమల్లు వైబ్ లో నిధి.. గెట్ రెడి!
ఇటీవల ఎక్స్‌లో అభిమానులతో ముచ్చటించిన హీరోయిన్ నిధి అగర్వాల్ సినిమా ప్రమోషన్స్, కొత్త సాంగ్ గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించింది.
By: Tupaki Desk | 25 May 2025 11:32 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే భిన్నంగా తెరకెక్కిన సినిమా ‘హరిహర వీరమల్లు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్లే ఈ సినిమా రిలీజ్ కానుంది. పవన్ పొలిటికల్ గా నేషనల్ వైడ్ గుర్తింపు అందుకున్న అనంతరం ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన వీరమల్లు, జ్యోతి కృష్ణ పూర్తి చేశాడు. ఈ భారీ బడ్జెట్ చారిత్రక యాక్షన్ అడ్వెంచర్‌లో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ఎ. ఎఎమ్ రత్నం నిర్మాణంలో రూపొందింది. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా, నర్గీస్ ఫాక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, పూజిత పొన్నాడ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
ఇటీవల ఎక్స్‌లో అభిమానులతో ముచ్చటించిన హీరోయిన్ నిధి అగర్వాల్ సినిమా ప్రమోషన్స్, కొత్త సాంగ్ గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించింది. ఎంఎమ్ కీరవాణి సంగీతం అందించిన ‘తారా తారా’ అనే లిరికల్ ట్రాక్ మే 28 విడుదల కానుందని తెలిపింది. “ఈ సాంగ్ అభిమానులు ఎదురుచూస్తున్న ఎనర్జీ, డాన్స్ వైబ్‌ను తీసుకొస్తుంది” అని నిధి చెప్పింది. ఈ సాంగ్‌లో ఆమె గ్లామరస్ లుక్, డాన్స్ మూమెంట్స్ అభిమానులను అలరించనున్నాయని అంటున్నారు.
ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ, మే 27 నుంచి పూర్తి స్థాయిలో ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలవుతాయని నిధి తెలిపింది. ఈ వార్త అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. అమెరికాలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ $60K మార్క్‌ను దాటాయి, ఇది సినిమాపై ఉన్న బజ్‌ను సూచిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను నార్త్ ఇండియాలో గ్రాండ్‌గా లాంచ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది, వేదిక ఎంపిక ఇంకా ఖరారు కానుంది.
ఇప్పటికే ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, ‘అసుర హననం’ సాంగ్స్‌తో అభిమానులను ఆకర్షించిన ‘హరిహర వీరమల్లు’, ‘తారా తారా’ సాంగ్‌తో మరింత హైప్ సృష్టించనుంది. ఈ సాంగ్‌లోని కొన్ని లిరిక్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని భావించిన పవన్ కళ్యాణ్, వాటిని మార్చమని టీమ్‌ను కోరిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఆల్బమ్‌లో మరో రెండు సాంగ్స్ కూడా త్వరలో విడుదల కానున్నాయి, ఇవి సినిమా క్రేజ్‌ను మరింత పెంచనున్నాయి.
