Begin typing your search above and press return to search.

జ్యోతి కృష్ణ‌పై క్రిష్‌కు కోపమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ ఇంకో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

By:  Tupaki Desk   |   22 July 2025 4:53 PM IST
జ్యోతి కృష్ణ‌పై క్రిష్‌కు కోపమా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ ఇంకో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అనౌన్స్ అయిందేమో ఆరేళ్ల కిందట. అప్పుడు ఆ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఆయన నాలుగేళ్లకు పైగా ఆ సినిమాతో అసోసియేట్ అయ్యే ఉన్నాడు. కానీ మేకింగ్ మరీ ఆలస్యం కావడం, సినిమా ఎంతకీ పూర్తి కాకపోవడంతో క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ మిగతా చిత్రాన్ని పూర్తి చేసే బాధ్యతను తీసుకున్నాడు.

ఐతే సినిమా మేకింగ్‌లో ఎవరి క్రెడిట్ ఎంత.. ఎవరు ఏం తీశారు అనే విషయంలో అందరికీ సందేహాలు ఉన్నాయి. కారణం ఏదైనా సరే.. తాను మొదలుపెట్టి ఒక కొలిక్కి తెచ్చిన ప్రాజెక్టును మరో దర్శకుడు టేకప్ చేసి పూర్తి చేయడం ఒకింత ఇబ్బంది కలిగించే విషయమే. ఈ సినిమా ఫైనల్ ఔట్ పుట్ విషయంలో క్రిష్ ఎలా ఫీలవుతున్నాడని అందరూ ఎదురు చూస్తున్నారు. ఐతే ఒకసారి ఈ ప్రాజెక్టుకు దూరం అయ్యాక దీని గురించి అస్సలు స్పందించని క్రిష్.. విడుదల ముంగిట సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టాడు. ఈ సినిమా క్రెడిట్ అంతా హీరో పవన్ కళ్యాణ్, నిర్మాత ఏఎం రత్నంలదే అంటూ వాళ్లిద్దరి మీదా ప్రశంసలు కురిపించాడు. తనకు ఈ సినిమా ఎంత స్పెషలో పేర్కొన్నాడు.

పవన్, రత్నంలకు రుణపడి ఉంటానన్నాడు. అంతా బాగుంది కానీ.. ఈ పోస్టులో క్రిష్ ఎక్కడా జ్యోతికృష్ణ పేరు ప్రస్తావించలేదు. క్రిష్ అనివార్య పరిస్థితుల్లోనే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇలా మధ్యలో వదిలేసిన ప్రాజెక్టును మరో దర్శకుడు తీసుకోవడానికి ఇష్టపడడు. కానీ జ్యోతికృష్ణ కూడా తప్పనిసరి స్థితిలోనే బాధ్యత తీసుకుని సినిమాను పూర్తి చేశాడు. కాబట్టి క్రిష్ అతడి పేరూ ప్రస్తావించి ఉంటే.. వివాదానికి తావే ఉండేది కాదు. కానీ జ్యోతికృష్ణ పేరును అవాయిడ్ చేయడం ద్వారా అతడి మీద ఏమైనా కోపం ఉందా అనే సందేహాలు రేకెత్తించాడు క్రిష్.