Begin typing your search above and press return to search.

పవన్ 'వీరమల్లు'.. మేకర్స్ లాస్ అవ్వడం ఖాయమా?

దీంతో సినిమా మరోసారి వాయిదా వేయడం దాదాపు కన్ఫర్మ్ అని టాక్ వినిపిస్తోంది. అయితే అది మామూలు విషయం కాదు.

By:  Tupaki Desk   |   5 Jun 2025 10:56 AM IST
పవన్ వీరమల్లు.. మేకర్స్ లాస్ అవ్వడం ఖాయమా?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ముందంతా మూవీ ఎప్పుడు పూర్తి అవుతుందని ఫ్యాన్స్ ఎదురు చూడగా.. ఇప్పుడు రిలీజ్ ఎప్పుడు అవుతోందని ఎదురుచూస్తున్నారు. జూన్ 12వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించినా, వాయిదా వేయడం పక్కా అని తెలుస్తోంది.

2020లో సినిమా స్టార్ట్ అవ్వగా.. 2025లో కంప్లీట్ అయింది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. కానీ అవి ఇప్పటికీ పూర్తి కాలేదని సమాచారం. ఎలా అయినా అనుకున్న తేదీకి మూవీ రిలీజ్ చేయాలని నిర్మాత ఏ ఎం రత్నం సహా టీమ్ ప్రయత్నాలు చేస్తున్నా.. అది జరిగేలా లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

దీంతో సినిమా మరోసారి వాయిదా వేయడం దాదాపు కన్ఫర్మ్ అని టాక్ వినిపిస్తోంది. అయితే అది మామూలు విషయం కాదు. ఇప్పటికే సినిమా స్టార్ట్ అయ్యి చాలా ఏళ్లు అయింది. ముఖ్యంగా ఓటీటీ డీల్ సెట్ అయిన తర్వాత మేకర్స్.. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. భారీ మొత్తంలో ఒప్పందం జరిగిందని సమాచారం.

అందుకే ఇప్పుడు రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తామంటే సదరు ఓటీటీ సంస్థ అంత వేగంగా ఒప్పుకోదని అంతా చెబుతున్నారు. విడుదల తేదీ స్లాట్స్ ను బాగా అబ్జర్వ్ చేసిన తర్వాతే ఏ ఓటీటీ సంస్థ అయినా డీల్ చేసుకుంటుంది. చెప్పిన డేట్ కు సినిమా రిలీజ్ చేయాలని ముందే చెబుతుంది. అలా జరగకపోతే తమ పద్ధతి ఫాలో అవుతుంది.

అదేంటంటే.. డీల్ లో రేటు తగ్గించి రివైజ్ చేస్తుంది. ఇప్పుడు హరిహర వీరమల్లు విషయంలో అదే జరగనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ ను చేంజ్ చేస్తే.. ఓటీటీ సంస్థ ఒప్పందంలో కోత విధించడం పక్కా అంట. దాదాపు రూ.20 కోట్లు కోత విధిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే ఓటీటీ డీల్ ఏ సినిమాకు అయినా ముఖ్యమే. కానీ మేకర్స్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు వీరమల్లును పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. కొత్త విడుదల తేదీని ఫిక్స్ చేశాక.. వీరమల్లు హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్వాహకులు ఏం చేస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. మరి వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఏం జరుగుతుందో వేచి చూడాలి.