సినిమా చూసిన తర్వాత డిబేట్ జరగాలి : పవన్ కళ్యాణ్
అంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆ విధులకు ఆటంకం కలగకుండా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు పవన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.
By: Tupaki Desk | 22 July 2025 7:23 PM ISTహరిహర వీరమల్లు సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇటీవల ప్రెస్ మీట్ లు, ఇంటర్వ్యూల్లో పాల్హొన్న మూవీటీమ్ తాజాగా హైదరాబాద్ లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న హీరో పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
అయితే రాజకీయాల వల్ల ఇన్ని రోజులు సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉన్న పవన్ ఇప్పుడు రూటు మార్చారు. ఈ సినిమా అనాథ కాదంటూ ఆయన ముందుకొచ్చి ప్రమోషన్స్ చేస్తున్నారు. నిన్నటి నుంచి సినిమా ప్రమోషన్స్ కు డేట్స్ కేటాయించిన పవన్ మరో రెండు రోజులు ప్రమోషన్స్ చేస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయా మీడియా వెబ్ సైట్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
అంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆ విధులకు ఆటంకం కలగకుండా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు పవన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. తొలిసారి క్రిష్ జాగర్లమూడి ఆయనను కలిసి కథ చెప్పినప్పుడే స్టోరీ ఆసక్తిగా అనిపించిందని అన్నారు. ఇది కోహినూర్ డైమండ్ కు సంబంధించిన కథ అని, సినిమా చూశాక ఆ కోహినూర్ డైమండ్ ను తిరిగి తీసుకురావడం పైనే చర్చ జరగాలని పవన్ అన్నారు.
అలాగే ఈ ఆయన మాట్లాడుతూ.. ఇది నేను రాజకీయాల్లో పూర్తిగా దిగకముందు ప్రారంభించిన సినిమా. ఈ సినిమా సినీ ప్రేక్షకుల అందరి కోసం. కోహీనూర్ డైమండ్ విజయవాడ కొల్లూరు లో దొరికింది. ఇక్కడ్నుంచి అది నిజాం, కులీ కుతుబ్ షాహీ, ఆ తర్వాత ఔరంగజేబు దక్కరకు వెళ్లింది. ఇప్పుడు అది లండన్ యూకే మ్యూజియంలో ఉంది. అలాంటి డైమండ్ ను గోదావరి జిల్లాలోని వ్యక్తి ఎలా తీసుకురాగలిగాడనేది ఈ సినిమా కథ.
ఇందులో ప్రత్యేకంగా సనాతన ధర్మం గురించే కాకుండా హిస్టారికల్, అండ్ ఎంటర్టైన్ పర్పస్ తెరకెక్కించాం. విజయనగరరాజుల గురించి పుస్తకాల్లో రాయలేదు. కానీ తిప్పికొడితే 200ఏళ్లు పాలించని మొగళుల గురించి చెప్పారు. అప్పట్లో హిందువు బతకాలంటే జిజియా పన్ను లాంటిది కట్టాలి. అలాంటి పరిస్థితులపై పోరాటమే ఈ కథ.
కానీ, ఓవరాల్ గా కొల్లూరు వజ్రాన్ని మన దగ్గరకు తీసుకురావాలి. అదే సినిమా కాన్సెప్ట్. ఇక రియల్ లైఫ్ లో కూడా కోహినూర్ వజ్రం మన దగ్గరకు రావాలి. అది మన ప్రాపర్టీ. పూర్తిగా భారత్ సొత్తు. దాని గురించి డిబేట్ ప్రారంభమవ్వాలని కోరుకుంటున్నా. సినిమాలు నేను ప్లాన్ చేసుకోని చేయలేదు. సహజంగా ఎలాంటి కథలు వస్తే అవే చేస్తాను. అని పవన్ అన్నారు.
కాగా, ఈ సినిమాను క్రిష్ ప్రారంభించిగా, జ్యోతి కృష్ణ టేకోవర్ చేశారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. కీరవాణి సంగీతం అందించారు. ఏ ఎం రత్నం ఈ సినిమాను నిర్మించిన ఈ సినిమా జూలై 24న థియేటర్లలో రిలీజ్ కానుంది.
