వీరమల్లు లో భారీ మార్పులు అవేంటంటే?
ఇటీవల రిలీజ్ అయిన `హరిహరవీరమల్లు` సినిమాపై తీవ్ర నెగిటివిటీ వ్యక్తమైన సంగతి తెలిసిందే. విఎఫ్ఎక్స్, సీజీ నాసిరకంగా ఉన్నాయంటూ ప్రేక్షకాభిమానులు అసహనాన్ని వ్యక్తం చేసారు.
By: Tupaki Desk | 28 July 2025 1:00 AM ISTఇటీవల రిలీజ్ అయిన `హరిహరవీరమల్లు` సినిమాపై తీవ్ర నెగిటివిటీ వ్యక్తమైన సంగతి తెలిసిందే. విఎఫ్ ఎక్స్, సీజీ నాసిరకంగా ఉన్నాయంటూ ప్రేక్షకాభిమానులు అసహనాన్ని వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ హీరోని పెట్టుకుని అలాంటి సినిమా చేసారంటనే బాధను వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ సినిమా విషయంలో పలు మార్పులు చేసారు. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిం చేందుకు అన్నీ థియేటర్లలలోనూ అప్ డేటెడ్ వెర్షన్ అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు.
ధర్మం కోసం పోరాటం ఇంకా పెద్దదైంది అంటూ ఎక్స్ లో ట్వీట్ చేసారు. అలాగే తెలంగాణలో సోమవారం నుంచి, ఏపీలో ఆగస్టు 2 నుంచి టికెట్ ధరలు తగ్గనున్నాయి. టికెట్ ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భారీగా టికెట్ ధరలు పెంచడంతోనూ ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లలేని పరిస్థితులు తెలి సిందే. ఆ సంగతి పక్కనబెడితే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాకు ఇలాంటి పరిస్థితి తలెత్తడం అన్నది ఆయన కెరీర్ లో ఇదే తొలిసారి. ఇంత వరకూ ఎన్నో సినిమాలు చేసారు.
ఎన్నో విజయాలు అందుకున్నారు. ఏ సినిమా విషయంలోనూ ఇలాంటి పొరపాట్లు జరగలేదు. అయితే పీరియాడిక్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా చేయడం అన్నది ఇదే తొలిసారి. వీఎఫ్ఎ క్స్, సీజీకి అధిక ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. అందులో తప్పులు దొర్లడంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తింది. పవన్ రాజ కీయాల్లో బిజీగా ఉండటంతో సినిమా రిలీజ్ అవ్వడం కూడా బాగా ఆలస్యమైంది. అలాగే పవన్ సినిమా అంటే? ఆయన పాత్ర నటించడం వరకే. ఆయన నటించిన సినిమాలు ఆయనే చూడరు.
ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో పవన్ తెలిపారు. సినిమాకు సంబంధించిన ఏ విషయాలు ఆయన పట్టించుకోరు. రిలీజ్ సమయంలో ప్రచారం లో కూడా కేవలం ప్రీరిలీజ్ లోనే పాల్గొంటారు. కానీ వీరమల్లు ప్రచారం విషయంలో పవన్ శ్రద్ద తీసుకుని మీడియా ముందుకొచ్చి ఎంతగానో ప్రమోట్ చేసారు. ఇంత వరకూ ఆయన ఏ సినిమాను కూడా ఇలా ప్రమోట్ చేయలేదు. నిర్మాత ఏ.ఎం రత్నం కూడా ఆయనకు మంచి స్నేహితుడు అన్న సంగతి తెలిసిందే.
