Begin typing your search above and press return to search.

పవన్ వీరమల్లు.. ఓపెనింగ్స్ సంగతేంటి?

టికెట్ రేట్ల పెంపుతో గత రెండేళ్ల విడుదలైన పాన్ ఇండియా చిత్రాల మొదటి రోజు కలెక్షన్లను హరిహర వీర మల్లు అధిగమిస్తుందో లేదో అంతా మాట్లాడుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   22 July 2025 11:14 PM IST
పవన్ వీరమల్లు.. ఓపెనింగ్స్ సంగతేంటి?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఆ సినిమా వరల్డ్ వైడ్ గా జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాల్లో జూలై 23వ తేదీన రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ కూడా ఉన్నాయి.

అయితే పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ గా రానున్న హరిహర వీరమల్లు టికెట్ రేట్ల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్స్ టికెట్ ధర రూ.600గా ఉంది. అదనంగా జీఎస్టీ కూడా తోడవుతుంది. దీంతో ఒక్కో టికెట్ కాస్ట్ రూ.708 సుమారుగా ఉంటుంది.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో మొదటి పది రోజుల వరకు.. లోయర్ క్లాస్‌ కు రూ. 100, సింగిల్ స్క్రీన్‌ లలో ఫస్ట్ క్లాస్ కు రూ. 150, మల్టీప్లెక్స్‌ ల్లో రూ. 200 వరకు వీరమల్లు టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సింగిల్ స్క్రీన్స్ లో రూ.297తోపాటు మల్టీప్లెక్స్ ల్లో రూ.377గా టికెట్ ధరలు ఉండనున్నాయి.

మరోవైపు తెలంగాణలో మల్టీప్లెక్స్‌ ల్లో రూ. 200 (జీఎస్టీ మినహాయించి), సింగిల్ స్క్రీన్‌లలో రూ. 150 (జీఎస్టీ మినహాయించి) పెంపును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. దీంతో సింగిల్ స్క్రీన్‌ ల్లో రూ. 354, రూ. మల్టీప్లెక్స్‌ ల్లో రూ.531గా టికెట్ రేట్లు ఉండనున్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త మొదలైంది.

టికెట్ రేట్ల పెంపుతో గత రెండేళ్ల విడుదలైన పాన్ ఇండియా చిత్రాల మొదటి రోజు కలెక్షన్లను హరిహర వీర మల్లు అధిగమిస్తుందో లేదో అంతా మాట్లాడుకుంటున్నారు. నైజాంలో ధరల పెరుగుదలతో అల్లు అర్జున్ పుష్ప 2 రూ. 25.30 కోట్లు (రూ.354 & రూ.531 ధరలు) వసూలు చేసింది. ఎన్టీఆర్ దేవర రూ. 19.31 కోట్లు (రూ.295 & రూ.413 ధరలు) రాబట్టింది.

ప్రభాస్ కల్కి 2898 ఏడీ రూ.16.30 కోట్లు (రూ.265 & రూ.413 ధరలు) వసూలు చేయగా.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రూ. 8.91 కోట్లు (రూ.277 & రూ.445 ధరలు) సాధించింది. మరోవైపు ఏపీలో పుష్ప 2 మొదటి రోజు రూ. 37.99 కోట్లు (రూ.300 & రూ.377 ధరలు), దేవర రూ.34.77 కోట్లు (రూ.257 & రూ.312 ధరలు), కల్కి రూ. 21.79 కోట్లు (రూ.236 & రూ.325 ధరలు), గేమ్ ఛేంజర్ రూ. 22.17 కోట్లు (రూ.282 & రూ.352 ధరలు) రాబట్టాయి.

అయితే హరిహర వీర మల్లు కూడా పుష్ప 2కు లాగానే టికెట్ రేట్ల విషయంలో భారీగా పెంచుకునేందుకు జీవోలను ప్రభుత్వాల నుంచి అందుకుంది. అందుకే వీరమల్లు ఫస్ట్ డే వసూళ్ల కోసం జోరుగా డిస్కస్ చేసుకుంటున్నారు. మరి పవన్ వీరమల్లు మూవీ ఓపెనింగ్స్.. వివిధ బడా హీరోల చిత్రాల ఫస్ట్ డే కౌంట్ ను బ్రేక్ చేస్తాయో లేదో అంతా వేచి చూడాలి.