వీరమల్లు సౌండ్ పెంచాల్సిందే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలుండగా అందులో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది.
By: Tupaki Desk | 26 May 2025 7:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలుండగా అందులో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది. అదే హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో కరోనాకు ముందు మొదలైన ఈ సినిమా ఆ తర్వాత కరోనాతో పాటూ వివిధ కారణాల వల్ల షూటింగ్ లేటవుతూ వచ్చింది. ఆ తర్వాత క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి డైరెక్టర్ గా తప్పుకున్నాడు.
దీంతో నిర్మాత ఏఎం రత్నం కొడుకు, డైరెక్టర్ ఏఎం జ్యోతికృష్ణ వీరమల్లు దర్శకత్వ బాధ్యతల్ని తీసుకుని, పవన్ డేట్స్ ఇచ్చే వరకు వెయిట్ చేసి మొత్తానికి దాన్ని పూర్తి చేశాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న వీరమల్లు జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ సినిమా విషయంలో పెద్ద ఎత్తున ఉత్కంఠ రేకెత్తుతుంది.
దానికి తగ్గట్టే హరిహర వీరమల్లు యూఎస్ఎ ప్రీ బుకింగ్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. అయితే టికెట్ ప్రీ సేల్స్ బావున్నప్పటికీ వీరమల్లు భారీ కలెక్షన్లు సంపాదించాలంటే ప్రమోషన్స్ ను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ వైపు సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ మేకర్స్ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేసింది లేదు.
రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, వీరమల్లుకు హైప్ రావాలంటే ట్రైలర్ రిలీజ్ చేసి, దాంతో బజ్ ను పెంచాలని నెటిజన్లు భావిస్తున్నారు. వాస్తవానికి రీసెంట్ గా వీరమల్లు నుంచి రిలీజైన అసుర హననం సాంగ్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావించినప్పటికీ అది వారి అంచనాలను అందుకోలేకపోయింది.
ఇదిలా ఉంటే మరో వైపు పవన్ నటిస్తున్న ఓజీ సినిమా కేవలం రిలీజ్ డేట్ పోస్టర్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటే రిలీజ్ కు రెడీ అయిన వీరమల్లు మాత్రం ఎలాంటి సౌండ్ లేకుండా సైలెంట్ గా ఉంది. కాబట్టి మేకర్స్ ఈ విషయాన్ని గ్రహించి వీలైనందత త్వరగా సినిమాకు హైప్ పెంచేలా ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. వీరమల్లు ట్రైలర్ వస్తే బజ్ పెరిగే అవకాశముంది.
