వీరమల్లును కరోనా కంగారు పెడుతోందా!
`హరిహరవీరమల్లు` రిలీజ్ సమయం దగ్గర పడుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో ప్రచారానికి టీమ్ రెడీ అవుతోంది.
By: Tupaki Desk | 27 May 2025 11:17 AM IST`హరిహరవీరమల్లు` రిలీజ్ సమయం దగ్గర పడుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో ప్రచారానికి టీమ్ రెడీ అవుతోంది. ముంబైలో నిర్వహించే మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని సమాచారం ఉంది. అలాగే రెండు భారీ ఈవెంట్లు కూడా నిర్వహిస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగానూ ప్రకటించారు. అందులో ఒక ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. అది తెలంగాణాలోనా? ఆంధ్రాలోనా? అన్నది క్లారిటీ లేదు.
కానీ ఈవెంట్ తప్పనిసరి. అయితే ఇప్పుడా చిత్ర యూనిట్ ను కరోనా వైరస్ కంగారు పెడుతోందా? పబ్లిక్ ఈవెంట్ విషయంలో నిర్ణయాలు మారే అవకాశం లేకపోలేదా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. వైరస్ కి సంబంధించి ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. కేసులు ఎక్కువవుతోన్న వేళ వైరస్ కు తగ్గ జాగ్రత్తలపై అలెర్ట్ ప్రకటించింది. స్వీయా జాగ్రత్తలు తప్పనిసరిగా సూచించింది.
దీంతో వీరమల్లు టీమ్ కు గుబులు మొదలైంది. అభిమానుల సమక్షంలో ఈవెంట్ నిర్వహించాలంటే సాద్యమవుతుందా? లేదా? అన్న కొత్త టెన్షన్ మొదలైంది. ఈ వెంట్ కు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. పైగా ఈ సినిమాలో నటించింది పవన్ కళ్యాణ్. అందులోనే ఆయన ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రజలకు సంబంధించిన బాధ్యతలు ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ పై ఉన్నాయి.
కాబట్టి వైరస్ సమయంలో ఇలాంటి ఈవెంట్లు అవసరమా? అన్న పునరాలోచించే అవకాశం ఉంది. పవన్ ఈవెంట్ అంటే భారీ ఎత్తున అభిమానులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తారు. కరోనా పాజిటివ్ కేసులు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల నమోదయ్యాయి. ఎవరిరి వారు స్వీయా నియంత్రణ పాటించ కపోయినా? బహిరంగంగా సినిమా ఈవెంట్ నిర్వహిస్తే అది సమస్యగా మారుతుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ , అతని నిర్మాతలు ఈవెంట్ విషయంలో మరో ఆలోచన ఏదైనా చేస్తారా? లేక యధావిధిగా నిర్వ హిస్తారా? అన్నది చూడాలి.
