Begin typing your search above and press return to search.

పవన్‌ ఫ్యాన్స్‌... వీళ్లతో మామూలుగా ఉండదు

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో వారు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఎవరైనా పవన్ ను చిన్న మాటతో విమర్శించినా కూడా విరుచుకు పడుతూ ఉంటారు.

By:  Tupaki Desk   |   10 Jun 2025 10:54 AM IST
పవన్‌ ఫ్యాన్స్‌... వీళ్లతో మామూలుగా ఉండదు
X

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో వారు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఎవరైనా పవన్ ను చిన్న మాటతో విమర్శించినా కూడా విరుచుకు పడుతూ ఉంటారు. అలాంటి ఫ్యాన్స్‌ను కలిగి ఉన్న పవన్‌ కళ్యాణ్‌ త్వరలో హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ఈ నెలలో విడుదల కావాల్సి ఉన్నా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే సినిమా విడుదల విషయంలో ఫ్యాన్స్‌ను చాలా నిరుత్సాహ పరచిన మేకర్స్ మరోసారి సినిమా విడుదల తేదీ ప్రకటించి వాయిదా వేయడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.

హరిహర వీరమల్లు సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించిన విషయం తెలిసిందే. ఆయన కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చూసుకున్నాడు. సినిమా విడుదల తేదీ విషయంలో వీరిద్దరి నుంచి స్పష్టత రాకపోవడం తో పాటు, గందరగోళపు ప్రకటనలు వస్తున్న కారణంగా అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆగ్రహంతో ఊగి పోతున్న వారు కొందరు అయితే, కొందరు మాత్రం వారు విడుదల తేదీని ప్రకటించేది ఏంటి.. మేమే సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటిస్తున్నాం అంటూ కొన్ని పోస్టర్స్‌ను విడుదల చేశారు. అందులో కొందరు జూన్‌ చివరి వారంలో వీరమల్లు రాబోతుందంటే, కొందరు జులై మొదటి వారంలో రాబోతుందని డేట్‌ను ఇచ్చేశారు.

ఆ అభిమానులు చేసిన పనితో చాలా మందిలో కన్ఫ్యూజన్‌ క్రియేట్‌ కాగా, కొందరు నిజంగానే ఆ తేదీకి వీరమల్లు రావచ్చు అని నమ్ముతున్నారు. కానీ ఇప్పటి వరకు మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. అది కేవలం సినిమా నిర్మాతలపై ఆగ్రహంతో అభిమానులు క్రియేట్‌ చేసిన పోస్టర్స్ అని తేలిపోయింది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతున్న కారణంగా ఈ తేదీలను ప్రకటించి, మళ్లీ వాయిదా వేయండి అంటూ వ్యంగంగా అభిమానులు ఆ పోస్టర్‌లను షేర్ చేసి నిర్మాణ సంస్థను ట్యాగ్‌ చేసి విమర్శలు చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్ అభిమానులు సోషల్‌ మీడియాలో మరీ అరాచకంగా ఉంటారు. వారు మరింతగా ఆగ్రహం చెందక ముందే విడుదల తేదీని నిర్మాణ సంస్థ ప్రకటిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

నాలుగు ఏళ్లుగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను మొదలు పెట్టాడు. మరీ ఎక్కువ ఆలస్యం అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన తప్పుకున్నాడు. దాంతో ఆ బాధ్యతను జ్యోతికృష్ణ తీసుకున్నాడు. ఆయన సినిమాను ఎలా తీశాడో అనే అనుమానం ఉంది. ఇలాంటి సమయంలో విడుదల విషయంలో వాయిదాలు వేస్తూ ఉండటంతో ఉన్న ఆసక్తి కూడా తగ్గుతుంది అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇప్పటికే వచ్చిన పాటలు ఒక మోస్తరుగా ఉన్నాయి అనే టాక్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. సినిమాకు బజ్‌ క్రియేట్‌ కాలేదు, బిజినెస్ కాలేదని వాయిదా వేశారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది వారికే తెలియాలి.