Begin typing your search above and press return to search.

ముంబై ప్రెస్ మీట్ లో ప‌వ‌న్ మెరుపులు!

నార్త్ ఈవెంట్ కి సంబంధించి ప‌వ‌న్ హాజ‌ర‌య్యే స‌మావేశం ఇదొక్క‌టే అవ్వొచ్చు. మిగ‌తా టీమ్ య‌ధా విధిగా ప్ర‌చారంలో భాగంగా వివిధ టీవీ షోల‌కు హాజ‌ర‌కానున్నారు.

By:  Tupaki Desk   |   24 May 2025 1:00 AM IST
ముంబై ప్రెస్ మీట్ లో ప‌వ‌న్ మెరుపులు!
X

`హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు` రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ప్ర‌చారం ప‌నుల‌కు స‌ర్వం సిద్ద‌మ‌వుతోంది. పాన్ ఇండియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు భారీ ఈవెంట్లు నిర్వ‌హిస్తామ‌ని నిర్మాత‌లు క్లారిటీ ఇచ్చారు. అందులో ఒకటి తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. అది తెలంగాణాలోనా? ఆంద్రప్ర‌దేశ్ లోనా? అన్న‌ది రివీల్ చేయ‌లేదు. దానిపై స‌స్పెన్స్ కొన‌సాగుతుంది.

ఈ నేప‌థ్యంలో ముంబైలో ప్రెస్ మీట్ కు స‌న్నాహాలు చేస్తున్నారు. జూన్ లో ఈ ప్రెస్ మెట్ ఉంటుంద‌ని స‌మాచారం. ఈ కార్య‌క్ర‌మానికి బాలీవుడ్ నుంచి కొంత మంది స్టార్ల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు తెలిసింది. అలాగే ఆ స‌మావేశానికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా హాజ‌ర‌వుతారని యూనిట్ వ‌ర్గాల స‌మాచారం. దీనికి సంబంధించి ప‌వ‌న్ అనుమ‌తులు తీసుకున్నారుట‌. ప‌వ‌న్ కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలిసింది.

నార్త్ ఈవెంట్ కి సంబంధించి ప‌వ‌న్ హాజ‌ర‌య్యే స‌మావేశం ఇదొక్క‌టే అవ్వొచ్చు. మిగ‌తా టీమ్ య‌ధా విధిగా ప్ర‌చారంలో భాగంగా వివిధ టీవీ షోల‌కు హాజ‌ర‌కానున్నారు. బెంగుళూరు, చెన్నైలో కూడా మీడియా తో ఇంట‌రాక్ష‌న్ ఉంటుంది. వాటికి ప‌వ‌న్ హాజ‌ర‌వుతారా? లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో మ‌ళ్లీ కోవిడ్ కేసులు న‌మోద‌వ్వ‌డం క‌ల‌క‌లం రేపుతుంది. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టికే కొన్ని కేసులు న‌మోద‌య్యాయి.

కోవిడ్ కు సంబంధించి ప్ర‌భుత్వాలు కూడా ముందొస్తు జాగ్ర‌త్య చ‌ర్య‌ల్లో భాగంగా హెచ్చ‌రిక‌లు జారీ చేసే అవ‌కాశం ఉంది. అలెర్ట్ ప్ర‌క‌టిస్తే గ‌నుక సినిమా ప్ర‌చారాల‌కు ఆటంకం త‌ప్ప‌దు. వీర‌మ‌ల్లు రిలీజ్ కు ఇంకా రెండు వారాలే స‌మ‌యం ఉంది. ఈలోగా క‌రోనా పీక్స్ కు చేర‌కుండా ఉంటే వీర‌మ‌ల్లు గ‌ట్టె క్కుతుంది. లేదంటే? ప్ర‌చారం సోష‌ల్ మీడియాకే ప‌రిమిత‌మ‌వ్వాల్సి ఉంటుంది.