Begin typing your search above and press return to search.

దిల్ రాజు నుంచి చేజారిన వీరమల్లు డీల్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ హరిహర వీరమల్లు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎట్టకేలకు మంచి బజ్ తోనే విడుదలకు సిద్ధమవుతోంది.

By:  Tupaki Desk   |   18 July 2025 3:32 PM IST
దిల్ రాజు నుంచి చేజారిన వీరమల్లు డీల్?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ హరిహర వీరమల్లు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎట్టకేలకు మంచి బజ్ తోనే విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాను జాతీయ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సినిమా టీమ్ భారీ ప్లాన్ వేసింది. టీజర్, గ్లింప్స్‌లతో ఇప్పటికే బజ్‌ను పెంచిన ఈ చిత్రం ఆగస్టు 24న థియేటర్లలోకి రాబోతోంది.

ఈ క్రమంలో సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు మెల్లమెల్లగా ఫైనలైజ్ అవుతున్నాయి. అయితే ఉత్తరాంధ్రలో మాత్రం ఒక చిన్న కన్ఫ్యూజన్ చోటు చేసుకుంది. ఈ రీజన్‌లో తొలి డీలింగ్ దిల్ రాజుతో జరిగిందని, ఆయన ముందుగా రూ.12 కోట్ల అడ్వాన్స్ తో హక్కులు సెక్యూర్ చేసుకున్నారని టాక్. కానీ కొన్ని రోజుల తర్వాత వినయ్ (విగ్నేశ్వర ఫిలింస్) అనే డిస్ట్రిబ్యూటర్ రూ.14 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడని నిర్మాతల వద్ద చెప్పటంతో, గత డీల్ మార్చబడిందని తెలుస్తోంది.

ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’కి రెండు వారాల ముందే రిలీజ్ ప్రమోషన్లు స్టార్ట్ కావాల్సి ఉండగా, ఈ డిస్ట్రిబ్యూషన్ మార్పు విషయమే ఆలస్యం చేసిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఓ ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు చేతి నుండి డీలింగ్ పోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్ మార్కెట్‌ను బట్టి చూస్తే 14 కోట్లు ఉత్తరాంధ్రకు ఎక్కువేమీ కాదు అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

వాస్తవానికి పవన్ సినిమాలకు ఉత్తరాంధ్రలో భారీ క్రేజ్ ఉంటుంది. గతంలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, వకీల్ సాబ్ వంటి చిత్రాలు ఉత్తరాంధ్రలో రికార్డు కలెక్షన్లు అందుకున్నాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు రూ.12 కోట్లు ఆఫర్ చేయగా, మరొకరైన వినయ్ రూ.14 కోట్లతో ముందుకు రావడం వల్లే నిర్మాతలు ఆ డీలును మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఏదేమైనా వీరమల్లు సినిమాకు ఓపెనింగ్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే పెట్టుబడులు వెనక్కి వస్తాయి. టిక్కెట్ల రేట్ల విషయంలో చర్చలు జరుగుతున్నాయి. నిర్మాత ఏఎం.రత్నం ప్రొడ్యూసర్ గా చాలా కాలం తరువాత తీసిన అతిపెద్ద సినిమా ఇది. ఆయన నిలదొక్కుకోవాలి అంటే వీరమల్లు సినిమాతో తప్పనిసరి గ్రాండ్ హిట్ కొట్టాల్సిందే. మరి ఆయన లక్కు ఎలా ఉంటుందో చూడాలి.