మళ్లీ 'యశోద' మేకర్స్ రంగంలోకి!
సమంత ప్రధాన పాత్రలో యువ దర్శకద్వయం హరి-హరీష్ 'యశోద' అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 April 2025 11:53 AM ISTసమంత ప్రధాన పాత్రలో యువ దర్శకద్వయం హరి-హరీష్ 'యశోద' అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ అంచనాలైతే అందుకోలేదు. ఈ సినిమా హిట్ అయితే సమంత ఇమేజ్ మారేది. అప్పటికే యూ టర్న్ లాంటి హిట్ తో ఓ ఐడెంటిటీ క్రియేట్ చేసింది. కానీ సక్సస్ తో దాన్ని కొనసాగించడంలో విఫలమైంది.
ఆ తర్వాత విజయాలు అనుకున్న స్థాయిలో పడలేదు. దీంతో సమంత కొంత కాలంగా రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. `యశోద` మేకర్స్ కి కూడా తర్వాత కొత్త అవకాశాలు రాలేదు. రైటర్లగా మంచి పేరున్నా సక్సెస్ లేకపోవడంతో రేసులో నిలవలేకపోయారు. దీంతో మరోసారి యశోద నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఆ దర్శకద్వయం పట్ల చొరవ చూపుతున్నారు. హరి-హరీష్ తో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.
రెండు కథలు రెడీ చేసి పెట్టినట్లు తెలిపారు. 'సారంగపాణి జాతకం' రిలీజ్ తర్వాత పట్టాలెక్కించే ప్రాజెక్ట్ ఇదేనన్నారు. అయితే ఇది లేడీ ఓరియేంటెడ్ సినిమా అవుతుందా? లేక స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్నారా? అన్నది రివీల్ చేయలేదు. 'యశోద' కమర్శియల్ గా సక్సెస్ అవ్వలేదు. ఆ సినిమాకు నష్టాలే మిగిలాయి. కంటెంట్ పరంగా యావరేజ్ గా నిలిచింది. అయినా వాటిని దృష్టిలో పెట్టుకోకుండా యువ ప్రతిభా వంతులకు మరో అవకాశం ఇవ్వడం అన్నది గొప్ప విషయం.
అలాగే పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు కాకుండా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా కూడా ఉంటుందని వెల్లడించారు. ఇంద్రగంటితో గతంలో కూడా కృష్ణ ప్రసాద్ సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే.
