వీరమల్లు థియేటర్ దగ్గర గొడవ.. ఎవరు చేశారంటే..?
By: Tupaki Desk | 23 July 2025 9:47 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా మరికొద్ది గంటల్లో రిలీజ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు లేని విధంగా సినిమా రిలీజ్ రోజు ముందే 500 సెంటర్స్ లో స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షోస్ విషయంలో ఇప్పటికే ఫ్యాన్స్ లో హంగామా మొదలైంది. వీరమల్లు థియేటర్ల దగ్గర పవర్ స్టార్ ఫ్యాన్స్ జాతర మొదలైంది.
తెలుగు రెండు రాష్ట్రాల్లో హరి హర వీరమల్లు జోష్ ఇలా ఉంటే. కర్ణాటకలో మాత్రం కన్నడిగులు ఈ సినిమా థియేటర్ దగ్గర గొడవకి దిగారు. వీరమల్లు సినిమా పోస్టర్స్ ని చించేశారు. దీనికి సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కన్నడిగులు ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే సినిమా పోస్టర్స్ లో టైటిల్ కన్నడలో లేదని వారు గుర్తించారు. అందుకే కన్నడలో ఉన్న పోస్టర్స్ ఇంకా సినిమాలు మాత్రమే ఇక్కడ ఆడించాలని వారు కోరుతున్నారు.
కర్ణాటకలో ఇతర భాషల సినిమాల పరిస్థితి కాస్త వేరుగా ఉంది. అక్కడ భాషా ప్రాధాన్యత దృష్ట్యా సినిమా టైటిల్ ఇంకా డబ్బింగ్ కూడా కన్నడలోనే జరగాలని చూస్తున్నారు. తెలుగు సినిమాలు తెలుగు పోస్టర్స్ ని అక్కడ ఎంకరేజ్ చేయకూడదని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే హరి హర వీరమల్లు థియేటర్ దగ్గర ప్లెక్సీలు చించి నానా హడావిడి చేశారు.
వీరమల్లు సినిమానే కాదు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాను అయితే అసలు కర్ణాటకలో రిలీజ్ కాకుండా కేసు వేశారు కన్నడిగులు. ఆ సినిమా ఎలాగు రిలీజ్ అవ్వకుండానే పోయింది. ఇక ఇప్పుడు వీరమల్లు సినిమా విషయంలో కూడా నిరసన కారులు గొడవ చేస్తున్నారు. కన్నడ భాషలో లేని కారణంగా పోస్టర్స్ చించేస్తూ గొడవ చేస్తున్నారు. మరి ఈ విషయంపై చిత్ర దర్శక నిర్మాతలు ఏం చేస్తారన్నది చూడాలి.
ఇలా భాషా ప్రాతిపదికన చూస్తూ నిరసనలు తెలిపితే తెలుగులో రిలీజ్ అయ్యే కన్నడ సినిమాల మీద ఇక్కడ ఫ్యాన్స్ గొడవ చేసే ఛాన్స్ ఉంటుంది. మరి సినిమాలు రాజకీయాలకు సంబంధం లేదంటూనే మళ్లీ రిలీజ్ టైం లో గొడవలు, నిరసనలు తెలపడంపై సినీ ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వీరమల్లు సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ ఫైట్ కూడా యాక్షన్ కొరియోగ్రఫీ చేశారని తెలుస్తుంది.
