Begin typing your search above and press return to search.

పవన్ 'వీరమల్లు'.. సెకండ్ హైయ్యెస్ట్ ఓపెనర్ గా నిలుస్తాడా?

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన హరిహర వీరమల్లు మరికొన్ని గంటల్లో సందడి చేయనున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 July 2025 11:05 AM IST
పవన్ వీరమల్లు.. సెకండ్ హైయ్యెస్ట్ ఓపెనర్ గా నిలుస్తాడా?
X

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన హరిహర వీరమల్లు మరికొన్ని గంటల్లో సందడి చేయనున్న విషయం తెలిసిందే. నిజానికి.. జులై 24న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుండగా.. జూలై 23వ తేదీ అంటే నేటి రాత్రి తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ పడనున్నాయి. దీంతో అంతా వెయిట్ చేస్తున్నారు.

క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా.. పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్ గా సందడి చేయనుంది. సినిమాలో చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు. నెవ్వర్ బిఫోర్ పవర్ ఫుల్ రోల్ లో యాక్ట్ చేశారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌ గా నటించగా.. బాబీ దేవోల్, అనుపమ్‌ ఖేర్, సత్యరాజ్‌ కీలక పాత్రలు పోషించారు.

అయితే తొలిభాగం ‘హరి హర వీరమల్లు: పార్ట్‌ 1- స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌ పేరుతో విడుదల కానుండగా.. ఇప్పుడు ఓపెనింగ్స్ కోసం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ధరలు పెంచేందుకు మేకర్స్ జీవోలు అందుకోగా.. సినిమా తొలి రోజు ఎంత సాధిస్తుందోనని అంతా తెగ మాట్లాడుకుంటున్నారు.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై బజ్ కూడా క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరమల్లు మూవీ రూ.30 కోట్ల ఓపెనింగ్స్ సాధిస్తుందని కొందరు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దీంతో 2025లో టాలీవుడ్ లో సెకెండ్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా నిలవనుందని ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి రూ.54 కోట్ల నికర వసూళ్లతో టాప్ లో ఉంది. ఆ తర్వాత బాలయ్య డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, హిట్: ది థర్డ్ కేస్ సహా పలు సినిమాలున్నాయి.

2025 లో టాలీవుడ్ టాప్ 5 ఓపెనర్లు:

గేమ్ ఛేంజర్ - రూ.54 కోట్లు

డాకు మహారాజ్ - రూ.25.35 కోట్లు

సంక్రాంతికి వస్తునం - రూ.23 కోట్లు

హిట్: ది థర్డ్ కేస్ - రూ.21 కోట్లు

కుబేరా - రూ.14.75 కోట్లు

దీంతో ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ మొదటి రోజు వసూళ్లతో గేమ్ చేంజర్ రికార్డు బ్రేక్ చేస్తుందో లేదో చెప్పలేమని.. కానీ సెకండ్ ప్లేస్ లో మాత్రం నిలవనుందని అంతా అంటున్నారు. అయితే లాంగ్ రన్ లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాలంటే.. మౌత్ టాక్ తో పాటు కంటెంట్ పై ఆధారపడి ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.