Begin typing your search above and press return to search.

వీరమల్లు.. ది బిగ్గెస్ట్ అప్డేట్ అవైటింగ్..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 Dec 2024 12:45 PM IST
వీరమల్లు.. ది బిగ్గెస్ట్ అప్డేట్ అవైటింగ్..
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఎప్పుడో ప్రారంభమైన ఆ సినిమా షూటింగ్ వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఆ తర్వాత ఏపీ రాజకీయాలతో పవన్ బిజీగా మారడం వల్ల కొన్ని నెలలపాటు హోల్డ్ లోకి వెళ్లిపోయింది.

ఇక పవన్ ఎన్నికల్లో గెలవడం, డిప్యూటీ సాబ్ గా బాధ్యతలు చేపట్టడం వల్ల షూటింగ్ మరింత లేట్ అయింది. ఇంతలో డైరెక్టర్ క్రిష్.. వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. జ్యోతి కృష్ణ.. దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

అయితే పవన్ తన చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో ఇప్పుడు హరిహర వీరమల్లును ముందుగా కంప్లీట్ చేస్తున్నారు. వరుసగా డేట్స్ ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆ మధ్య మూవీ అనుకున్న తేదీకి రిలీజ్ అవ్వదని వార్తలు వచ్చినా.. ఇప్పుడు కచ్చితంగా విడుదల అవుతుందని చెబుతున్నారు సినీ పండితులు.

ఇక సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్వరపరచిన ఆ సాంగ్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ ఆలపించారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మిక్సింగ్ కంప్లీట్ అయిందని, రిలీజ్ అవ్వడమే లేట్ అని టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో ఇప్పుడు బిగ్ ప్రమోషనల్ వీడియోను మేకర్స్ రెడీ చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఫుల్ వీఎఫ్ ఎక్స్ సర్ప్రెజులతో వీడియో ఉంటుందని టాక్ నడుస్తోంది. అందులో పవన్.. రెండు విభిన్న లుక్స్ లో కనిపించనున్నారని సమాచారం. అందుకు సంబంధించిన వర్క్ ఇరాన్, కెనడాలో జరుగుతున్నట్లు వినికిడి.

అయితే సినిమా కోసం వేసి అజ్మీర్ పోర్ట్, ప్యాలెస్, చార్మినార్ సెట్స్.. వీడియోలో హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. అలా వీడియో అప్డేట్ తో మేకర్స్.. మూవీపై భారీ బజ్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వేరే లెవెల్ హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. జనవరిలోనే రిలీజ్ చేయాలని సిద్ధమవుతున్నారు. మరి ఆ వీడియో కంటెంట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.