మూడు వారాల ముందుగానే పవన్ వీరమల్లు..!
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'హరి హర వీరమల్లు' ఈ నెలలో విడుదల కావాల్సి ఉండగా వీఎఫ్‌ఎక్స్ ఆలస్యం కావడంతో వాయిదా వేసిన విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 25 Jun 2025 4:17 PM ISTపవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'హరి హర వీరమల్లు' ఈ నెలలో విడుదల కావాల్సి ఉండగా వీఎఫ్‌ఎక్స్ ఆలస్యం కావడంతో వాయిదా వేసిన విషయం తెల్సిందే. జులై మొదటి వారంలో విడుదల చేయాలని నిర్మాణ సంస్థ భావించినా కూడా అమెజాన్‌ప్రైమ్‌తో ఉన్న ఒప్పందం కారణంగా జులై చివరికి వాయిదా వేశారు. ఇటీవల నిర్మాణ సంస్థ హరి హర వీరమల్లు సినిమాను జులై 24కి ఖరారు చేయడం జరిగింది. ఆ విషయం గురించి అధికారికంగా ప్రకటన విడుదలైంది. జులై 24న రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సాధారణంగా సినిమా విడుదలకు వారం లేదా రెండు వారాల ముందు ట్రైలర్‌లను విడుదల చేస్తారు. కానీ ఈ సినిమా ట్రైలర్‌ను మూడు వారాల ముందు విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్‌ను ఈ నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇంతకు ముందే ట్రైలర్ కట్ పూర్తి అయింది. విడుదల తేదీ వాయిదా పడటంతో ట్రైలర్ విడుదలను ఆపేసిన విషయం తెల్సిందే. ఎలాగూ ట్రైలర్ రెడీగా ఉంది, కనుక వెంటనే విడుదల చేస్తే ఒక పనైపోతుంది కదా అనే అభిప్రాయంను చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పైగా సినిమా ట్రైలర్‌ను వదిలితే సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతాయి. అందుకే వీరమల్లు ట్రైలర్‌ను మూడు వారాల ముందుగానే థియేటర్‌ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
జులై మొదటి వారంలో విడుదల కాబోతున్న ఒక పెద్ద సినిమాతో వీరమల్లు సినిమా ట్రైలర్‌ను థియేటర్‌లలో స్క్రీనింగ్ చేసేందుకు నిర్మాణ సంస్థ ప్రయత్నాలు చేసిందని తెలుస్తోంది. అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత సినిమా స్థాయి కచ్చితంగా పెరుగుతుందనే విశ్వాసంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను క్రిష్ దర్శకత్వంలో మొదలు పెట్టారు. చాలా ఆలస్యం కావడంతో సినిమా దర్శకత్వ బాధ్యతలను నిర్మాత ఏ ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. ఆయన ఈ సినిమాను ఫినిష్ చేశాడు. ఈ సినిమా యొక్క బడ్జెట్ భారీగా పెరిగింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా గ్రాండ్‌గా ఉంటుందని దర్శకుడు జ్యోతికృష్ణ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ స్టార్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది అనే విశ్వాసంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు జ్యోతికృష్ణ సినిమా ప్రమోషన్‌ను మొదలు పెట్టాడు. తెలుగులో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. అంతే కాకుండా తమిళనాట ఈ సినిమా ను పెద్ద ఎత్తున విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఓజీ సినిమా రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్స్ ఆగస్టు లో షురూ కానున్నాయి. ఆగస్టులోనే ఓజీ ట్రైలర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
