మొత్తానికి పవన్ ను ఇంప్రెస్ చేశారుగా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కరోనాకు ముందు మొదలైంది.
By: Tupaki Desk | 30 Jun 2025 11:00 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కరోనాకు ముందు మొదలైంది. సినిమా మొదలై ఇన్నేళ్లవుతున్నా ఇప్పటికీ వీరమల్లు రిలీజవలేదు. కరోనా రావడం, తర్వాత పవన్ బిజీ అవడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో క్రమంగా వీరమల్లుపై అందరికీ ఆసక్తి తగ్గింది.
రీసెంట్ గానే ఈ సినిమా షూటింగును పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది. దీంతో ఎప్పుడెప్పుడు వీరమల్లును చూస్తామా అని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జులై 24న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఇక ప్రమోషన్స్ స్పీడును పెంచాలని చూస్తున్నారు.
అందులో భాగంగానే జులై 3న వీరమల్లు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ట్రైలర్ రిలీజ్ ను గ్రాండ్ సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే వీరమల్లు ట్రైలర్ గురించి ఓ వార్త నెట్టింట వినిపిస్తోంది. ఇప్పటికే వీరమల్లుకు సంబంధించిన ట్రైలర్ కట్ పూర్తైందని, ఆ ట్రైలర్ ను మేకర్స్ పవన్ కళ్యాణ్ కు చూపించగా, ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయిన పవన్ కళ్యాణ్, ట్రైలర్ ను గ్రాండ్ గా లాంచ్ చేయడానికి ఆమోదం తెలిపారని అంటున్నారు.
కాగా హరి హర వీరమల్లు సినిమాను మొదటిగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి స్టార్ట్ చేయగా, తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు నుంచి క్రిష్ తప్పుకోవడంతో వీరమల్లు దర్శకత్వ బాధ్యతల్ని ఏఎం జ్యోతికృష్ణ తీసుకుని పూర్తి చేశారు. భారీ బడ్జెట్ తో ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా కనిపించనుండగా, కీరవాణి వీరమల్లుకు సంగీతం అందించారు.
