హరి హర వీర మల్లు.. మరో సర్ ప్రైజ్ ఏంటంటే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమా హరి హర వీర మల్లు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని చివరికి జూలై 24న విడుదలకు రెడీ అవుతోంది
By: Tupaki Desk | 22 Jun 2025 1:50 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమా హరి హర వీర మల్లు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని చివరికి జూలై 24న విడుదలకు రెడీ అవుతోంది. అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేలా సన్నాహాలు జరుపుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమాపై మళ్లీ హైప్ పెంచేందుకు కీలకమైన అంశం ట్రైలర్ కావడం విశేషం.
లేటెస్ట్ సమాచారం ప్రకారం, జ్యోతి కృష్ణ నేతృత్వంలో టెక్నికల్ టీం కొత్త ట్రైలర్ రూపకల్పనలో నిమగ్నమై ఉంది. వీఎఫ్ఎక్స్ పనులు చివరి దశలో ఉండటంతో, దానిని బట్టి కొత్త ట్రైలర్ కట్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ మెయిన్‌గా బజ్ క్రియేట్ చేయడమే కాకుండా, సినిమా థియేట్రికల్ బిజినెస్ పూర్తయ్యేలా చేస్తుందని అంచనా. ట్రైలర్‌ను జూలై మొదటి వారం రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. పవన్ అభిమానులంతా ఈ ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి ఫేం ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ట్రైలర్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ చిత్రాన్ని మొదటగా క్రిష్ డైరెక్ట్ చేయగా, చాలా భాగాన్ని పూర్తి చేసిన తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. తరువాత దర్శకత్వ బాధ్యతలు జ్యోతి కృష్ణ తీసుకున్నారు. అయినప్పటికీ మేకింగ్ విధానంలో ఎలాంటి మార్పు రాలేదని పర్ఫెక్ట్ అవుట్ పుట్ వచ్చినట్లు మేకర్స్ చెబుతున్నారు. పవన్ కల్యాణ్ అద్భుతమైన పాత్రలో నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్‌గా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే సినిమా ఓ వాయిదా తర్వాత మరోసారి వాయిదా పడటంతో అభిమానుల్లో నిరాశ నెలకొన్నా.. ఇప్పుడు ట్రైలర్ డేట్ ఫిక్స్ కావడం, విడుదల తేదీ ఖరారు కావడం మరలా హైప్‌ను రీసెట్ చేసింది. జూలై 24న థియేటర్లలోకి రాబోతున్న హరి హర వీర మల్లు, ట్రైలర్ ద్వారా ఎంత హంగామా చేస్తుందో చూడాలి. అలాగే పవన్ పవర్‌తో ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి.
