వీరమల్లు ట్రైలర్ పై చిరు, చరణ్ ఏమన్నారంటే..?
పవన్ కళ్యాణ్ ట్రైలర్ పై చిరు, చరణ్ ట్వీట్ వేయడంతో మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.
By: Tupaki Desk | 3 July 2025 7:18 PM ISTఏ.ఎం రత్నం డైరెక్షన్ లో క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన హరి హర వీరమల్లు సినిమా మధ్యలో ఆయన బయటకు వెళ్లగా జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. హరి హర వీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ గా సినిమా మొదటి పార్ట్ వస్తుంది. ఈ సినిమా ఈ నెల 24న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా సినిమా నుంచి ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ గురించి ముందు వచ్చిన లీక్స్ లాగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేసింది. పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక యోధుడిగా కనిపించనున్నారు.
ట్రైలర్ ఈ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఊహించలేదు. సినీ లవర్స్ కూడా వీరమల్లు ట్రైలర్ తో ఉలిక్కిపడ్డట్టుగా ఉన్నారు. ఇక ఈ సినిమా పై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. వీరమల్లు ట్రైలర్ ఎలెక్ట్రిఫైయింగ్ గా ఉంది. దాదాపు రెండేళ్ల తర్వాత తర్వాత కళ్యాణ్ బాబు నుంచి వస్తున్న ఈ మూవీ థియేటర్లలు ఫైర్ అంటే అదిరిపోవాలన్నట్టుగా చెప్పారు. ఈ సినిమా టీం కు బెస్ట్ విషెస్ అంటూ ట్వీట్ చేశారు.
ఇక వీరమల్లు ట్రైలర్ పై గ్లోబల్ స్టార్ రాం చరణ్ కూడా తన రెస్పాన్స్ సోషల్ మీడియాలో పెట్టారు. హరి హర వీరమల్లు ట్రైలర్ గ్రాండియర్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వెండితెర మీద మనందరికీ ట్రీట్ ఇవ్వనున్నారు. చిత్ర యూనిట్ అందరికీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు చరణ్.
పవన్ కళ్యాణ్ ట్రైలర్ పై చిరు, చరణ్ ట్వీట్ వేయడంతో మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఐతే వీరమల్లు ట్రైలర్ చూస్తే మెగా ఫ్యాన్ కాకపోయినా కూడా కచ్చితంగా వారెవా అనేయక తప్పదు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఐతే ఇది విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఉందని చెప్పొచ్చు. ఏ.ఎం.రత్నం వీరమల్లు మీద పెట్టుకున్న నమ్మకం నిజం అయ్యేలా ఉందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు. వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా వీరమల్లు ట్రైలర్ చూశాక సినిమా కచ్చితంగా రికార్డులు బద్ధలు కొట్టేలా ఉందని ఫిక్స్ అయ్యారు.
