Begin typing your search above and press return to search.

ఇక డేట్ మారదు.. రికార్డులు మారుతాయ్: వీరమల్లు డైరెక్టర్

ఆ ఈవెంట్ లో డైరెక్టర్ జ్యోతి కృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

By:  Tupaki Desk   |   3 July 2025 12:56 PM IST
ఇక డేట్ మారదు.. రికార్డులు మారుతాయ్: వీరమల్లు డైరెక్టర్
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఆ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో సమర్పించారు. ఆయన సోదరుడు దయకరరావు గ్రాండ్ గా నిర్మించారు.

ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పిన హరిహర వీరమల్లు.. జులై 24వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఆ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ చేపడుతున్నారు. అందులో భాగంగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆ ఈవెంట్ లో డైరెక్టర్ జ్యోతి కృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

"ట్రైలర్ లాంచ్ తర్వాత కొందరు గురించి మాట్లాడాలనుకుంటున్నా. వారెవరో తెలియదు. ఎక్కడ ఉంటారో తెలియదు. కానీ సినిమా మొదలైన నాటి నుంచి నెగిటివ్ గా మాట్లాడుతూనే ఉన్నారు. సినిమా రాదు.. ఆగిపోయిందని చాలా నెగిటివ్ గా కామెంట్స్ చేశారు. సినిమా స్టార్ట్ అయ్యి ఐదేళ్లు అయింది" అని చెప్పారు.

"ఐదేళ్లలో రెండు ప్యాండిమిక్స్ తో అడ్డంకి ఏర్పడింది. కానీ మేం ఆగలేదు.. పని చేసుకుంటూనే ఉన్నాం. ఆ తర్వాత ఎన్నికలు.. మంచి రిజల్ట్ వచ్చింది. పవర్ స్టార్ 100 స్ట్రైక్ రేట్ తో గెలిచారు. డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.. ఆపలేదు.. మేము కూడా మా పని ఆపలేదు " అని జ్యోతి కృష్ణ తెలిపారు.

"మాకు తెలుసు.. మీకు తెలుసు.. వాళ్ళు రాసే పిచ్చి రాతలు.. నెగిటివ్ కామెంట్స్.. పవర్ స్టార్ మూవీని ఆపలేవు. చిన్న గుడిసె కాదు.. కంచుకోట.. అభిమానులను ఎవరూ ఆపలేరు. చాలా మంది బడ్జెట్ ఎక్కువైంది.. వర్కౌట్ అవుతుందా అని అన్నారు. పవన్ సర్ ఇమేజ్ కు ఎంత చేసినా తక్కువే " అని డైరెక్టర్ కొనియాడారు.

"నిర్మాత ఏఎం రత్నం గారి సినిమాలన్నీ హై బడ్జెట్ లే. అన్నీ పెద్ద సినిమాలే. అన్ని భాషల్లో హిట్ అయ్యాయి. ఇప్పుడు వీరమల్లు విషయంలో కూడా అదే జరుగుతుంది. 2004లో ఖుషి సినిమా ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీ. రూ.100 కోట్ల ఫస్ట్ గ్రాస్ కలెక్షన్ రాబట్టిన మూవీ గబ్బర్ సింగ్.. ఆ రెండు చిత్రాలు పవన్ కళ్యాణ్ సర్ వే" అని జ్యోతి కృష్ణ గుర్తు చేశారు.

"ఇప్పుడు వీరమల్లుతో 100 శాతం స్ట్రైక్ రేట్ తో కొట్టబోతున్నాం. గ్రౌండ్ ప్లాన్ ఏర్పాటు చేసిన డైరెక్టర్ క్రిష్ గారికి చాలా థ్యాంక్స్. త్రివిక్రమ్ గారి మద్దతుకు థ్యాంక్స్. మంచి అవుట్ పుట్ ఇచ్చేందుకు ట్రై చేశాం. అందుకే లేట్ అయింది. ఈసారి రిలీజ్ డేట్ అసలు మారదు.. ఇండస్ట్రీలో రికార్డులు మారుతాయ్ " అంటూ ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశారు. మరి సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.