Begin typing your search above and press return to search.

బుర్జ్ ఖలీఫా వద్ద వీరమల్లు.. తొలిసారి ఇలా..

ఇది సినిమాకు భారీ హైప్‌ను తెచ్చిపెడుతుంది, ఒక గొప్ప మార్కెటింగ్ స్టంట్‌గా కూడా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 May 2025 5:56 PM IST
బుర్జ్ ఖలీఫా వద్ద వీరమల్లు.. తొలిసారి ఇలా..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాపై మళ్లీ మెల్లగా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. అలాగే చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. జూన్ 12 గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది, క్రిష్ జాగర్లమూడి, ఎఎమ్ జ్యోతి కృష్ణ సంయుక్త దర్శకత్వంలో రూపొందుతోంది. నిధి అగర్వాల్, బాబీ డియోల్, అర్జున్ రాంపాల్ పూజిత పొన్నాడ వంటి స్టార్ కాస్ట్‌తో ఈ సినిమా భారీగా తెరకెక్కుతోంది.

ఎఎమ్ రత్నం నిర్మాతగా, ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా ఈ సినిమా టెక్నికల్‌గా బలంగా ఉంది. సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి, రాత్రి పగలు టీమ్ నాణ్యత కోసం కష్టపడుతోంది. ఈ సినిమా ప్రారంభం నుంచి తక్కువ బజ్‌తో సాగుతున్నప్పటికీ, ఇప్పుడు నిర్మాతలు దూకుడుగా ప్రమోషన్స్ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సినిమా ట్రైలర్‌ను దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వద్ద విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. బుర్జ్ ఖలీఫా వద్ద ఇప్పటివరకు టీజర్లు, పోస్టర్లు, సినిమా ప్రకటనలు వంటి ప్రమోషనల్ ఈవెంట్స్ జరిగాయి, కానీ తెలుగు సినిమా ట్రైలర్ లేదా ఏదైనా కంటెంట్ ఇంతవరకు అక్కడ విడుదల కాలేదు. ఒకవేళ ‘హరిహర వీరమల్లు’ టీమ్ ఈ ఆలోచనను సాకారం చేస్తే, తెలుగు సినిమా చరిత్రలో ఇది తొలి ఘట్టంగా నిలుస్తుంది.

ఇది సినిమాకు భారీ హైప్‌ను తెచ్చిపెడుతుంది, ఒక గొప్ప మార్కెటింగ్ స్టంట్‌గా కూడా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘కొల్లగొట్టినాదిరో’ సింగిల్‌కు అద్భుతమైన స్పందన రావడంతో, నిర్మాతలు మరింత ఉత్సాహంగా ఉన్నారు. మే 19 సోమవారం నాడు మూడో సింగిల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆల్బమ్‌లోని పాటలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి.

ఈ సినిమా సౌండ్‌ట్రాక్‌ను కొన్ని చారిత్రక సినిమాల స్థాయికి పోలుస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ ధైర్యవంతుడైన యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. 17వ శతాబ్దపు మొఘల్ రాజుల నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్‌గా ఉంటాయని టాక్. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ కాస్ట్ సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. మొత్తంగా, ‘హరిహర వీరమల్లు’ టీమ్ బుర్జ్ ఖలీఫా వద్ద ట్రైలర్ విడుదల చేసే ప్లాన్ సఫలమైతే, తెలుగు సినిమా ప్రమోషన్స్‌లో ఇది కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది. ఇక సినిమాపై ఈ ప్లాన్ ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాయో చూడాలి.