Begin typing your search above and press return to search.

హరిహర వీరమల్లు.. టైటిల్ కు అసలు అర్థమిదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ తేదీ దగ్గరపడుతోంది.

By:  Tupaki Desk   |   20 July 2025 7:00 AM IST
హరిహర వీరమల్లు.. టైటిల్ కు అసలు అర్థమిదే!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ తేదీ దగ్గరపడుతోంది. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ నటిస్తున్న పాత్ర, చారిత్రక నేపథ్యం, భారీ మేకింగ్‌ నేపథ్యంలో సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లు వేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించి బాబీ డియోల్ కీలక పాత్ర పోషించగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. జ్యోతికృష్ణ, క్రిష్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై సీనియర్ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే కథ ఆధారంగా ఇటీవల కొన్ని ప్రచారాలు జరగడం, ఇది నిజ జీవిత కథ అని రూమర్స్ రావడం చర్చకు దారితీసింది.

ఈ నేపథ్యంలో నిర్మాత ఏఎం రత్నం లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. “ఇది 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కల్పిత కథ. ప్రస్తుతం బయట జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకుని, దాని చుట్టూ కథ అల్లటం జరిగింది,” అని రత్నం స్పష్టం చేశారు. అయితే ఆ కాలం నాటి పరిస్థితులను మాత్రం హైలెట్ చేయనున్నట్లు తెలిపారు.

అలాగే, ‘హరి హర వీరమల్లు’ అనే పేరుకు కూడా ఓ ప్రత్యేక అర్థం ఉందని ఆయన తెలిపారు. “హరి హర అంటే విష్ణువు, శివుడు కలయికను సూచిస్తుంది. అలాగే ‘వీరమల్లు’ అనే పేరు వీరుడిని సూచించేలా పెట్టాం. ఈ పేరు కథలోని పాత్ర బలాన్ని, ధైర్యాన్ని ప్రతిబింబించేలా ఉంది,” అని ఆయన వివరించారు. ఇక విడుదల ఆలస్యం అయినప్పటికీ సినిమా లేటెస్ట్ పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్లే ఉంటుందని అన్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు అప్‌డేట్లు వచ్చాయి. విడుదల తేదీకి ముందు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అలాగే ఏపీలో రిలీజ్ డేట్ కంటే ముందు రోజే రాత్రి 9:30కి స్పెషల్ ప్రీమియర్ షోలు వేయడానికి మేకర్స్ ప్రభుత్వ అనుమతి కోరారు. అలాగే టిక్కెట్ల రేట్లు కూడా కొంత పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా కంటెంట్ ఆడియెన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.