Begin typing your search above and press return to search.

వీరమల్లు టికెట్ ధరలు.. ఏపీ - తెలంగాణలో ఎంత?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లుకు సంబంధించి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది టికెట్ ధరల అంశం.

By:  Tupaki Desk   |   18 July 2025 5:00 PM IST
వీరమల్లు టికెట్ ధరలు.. ఏపీ - తెలంగాణలో ఎంత?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లుకు సంబంధించి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది టికెట్ ధరల అంశం. చిరకాలంగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం చివరకు జూలై 24న విడుదలకు సిద్ధమవుతోంది. మెగా అభిమానులే కాదు.. సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా గురించి మంచి ఆసక్తి నెలకొంది. భారీ స్కేల్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావాలంటే టికెట్ ధరలు కీలకం అవుతాయి. గతంలో పెద్ద సినిమాలకు ప్రభుత్వం టికెట్ ధరలు పెంచడానికి అనుమతించింది. ఇప్పుడు అదే రూట్ లో హరిహర వీరమల్లు నిర్మాతలు కూడా స్పెషల్ రేట్ల కోసం ప్రభుత్వ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ముందస్తు సమాచారం ప్రకారం ఏపీలో ఈ సినిమా టికెట్ ధరలు భారీగా ఉండనున్నాయి.

ఏపీ సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ధర రూ.236గా ఉండే అవకాశం ఉంది. మల్టీప్లెక్సుల్లో అయితే ఇది రూ.295 వరకు వెళ్లనుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పెర్మిషన్ ఇచ్చిన తర్వాతే ఖరారు అవుతుంది. ఇక తెలంగాణలో అయితే టికెట్ల ధరలు మరింత ఎక్కువగా ఉండనున్నాయనే ప్రచారం సాగుతోంది. అక్కడ సింగిల్ స్క్రీన్ టికెట్ ధర రూ.265.50గా, మల్టీప్లెక్స్ ధర రూ.413గా ఉండే అవకాశం ఉంది. ఈ మొత్తాలు ఖచ్చితంగా రావాలంటే సంబంధిత ప్రభుత్వల GO రావాలి.

ఇప్పటి వరకు మేకర్స్ నేరుగా ఈ విషయంపై అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వీటిని ఫైనల్ గా భావిస్తున్నారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు ఫ్యాన్స్ క్రేజ్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రీమియం రేట్లకు కూడా డిమాండ్ ఉండటం ఖాయం. పీరియాడిక్ యాక్షన్ ఎలిమెంట్స్, పవన్ కళ్యాణ్ లుక్, భారీ విజువల్స్, సంగీతం అన్నింటికీ మంచి హైప్ ఉన్న నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపు సహజమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇక టికెట్ ధరల పెంపుతో సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ అభిమానులు ఖచ్చితంగా ఎలాంటి రేట్లైనా ఫస్ట్ డేకు భారీగా థియేటర్లకు వెళ్లే అవకాశం ఉంది. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది చూడాలి. ఏదేమైనా ఈ టికెట్ ధరలు సినిమాకు మరింత హైప్ తెచ్చేలా మారాయి. అధికారిక GO వస్తే.. మరిన్ని వివరాలతో మేకర్స్ అప్‌డేట్ ఇవ్వనున్నారని సమాచారం.