Begin typing your search above and press return to search.

'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' ఔరంగ‌జేబ్ క‌థ‌?

హరిహర వీరమల్లు పాత్ర‌ పూర్తిగా కల్పితం. దీన్ని రకరకాలుగా, రకరకాల కాలాలతో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 July 2025 9:03 AM IST
హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ఔరంగ‌జేబ్ క‌థ‌?
X

'హరిహర వీరమల్లు' కథ కృష్ణా నదీ తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం కులీకుతుబ్ షాల దగ్గర నుంచి మొఘ‌లుల వద్దకు ఎలా చేరిందో చెప్పే క‌థ అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హరిహర వీరమల్లు కథానాయకుడు పవన్ కళ్యాణ్ తాజా ఇంట‌ర్వ్యూలో స్పష్టం చేశారు. హిందువులుగా బతకాలంటే పన్నులు కట్టాలనే మొఘ‌ల్ పాల‌కుడు ఔరంగ‌జేబు నిజ స్వ‌రూపాన్ని తెలిపే క‌థ ఇది. త‌న‌కు అడ్డొచ్చిన రక్త సంబంధీకులనే చంపిన ఔరంగజేబు స్వరూపాన్ని తెలిపే గొప్ప కథ'' అని అన్నారు ప‌వ‌న్.

హరిహర వీరమల్లు పాత్ర‌ పూర్తిగా కల్పితం. దీన్ని రకరకాలుగా, రకరకాల కాలాలతో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు. సర్వాయి పాపన్న కథ అని, మరో వీరుడి కథగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో అంత‌ర్లీనంగా ఔరంగ జేబ్ పాల‌న‌ను చూపిస్తున్నామ‌ని అన్నారు. ధర్మం కోసం పోరాడిన యోధుడి సినిమా. హిందువుగా బతకాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితిలో ధర్మాన్ని కాపాడేందుకు చేసే పోరాటం ఈ సినిమాలో చూపించామ‌ని తెలిపారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల ప్ర‌కారం.. ఈ చిత్రంలో కోహినూర్ వ‌జ్రం కోసం వెతికే వాడిగా వీర‌మ‌ల్లు పాత్ర ఉంటుంది. అలాగే ఔరంగ జేబ్ లాంటి కుట్ర‌దారుకు జవాబిచ్చేవాడిగాను అత‌డి పాత్ర‌ను చూడ‌వ‌చ్చు. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రం ఈ గురువారం(24 జూలై) విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌న్ ఫ్యాన్స్ నడుమ హంగామా పీక్స్ కి చేరుకుంది.