Begin typing your search above and press return to search.

వీరమల్లు బ్యాడ్‌ న్యూస్‌.. నిజం కావద్దని ప్రార్థన

పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమాను జూన్‌ 12న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.

By:  Tupaki Desk   |   3 Jun 2025 3:51 PM IST
వీరమల్లు బ్యాడ్‌ న్యూస్‌.. నిజం కావద్దని ప్రార్థన
X

పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమాను జూన్‌ 12న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆమధ్య షూటింగ్‌ పూర్తి చేసిన మేకర్స్ విడుదల తేదీని ప్రకటిస్తూ అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పారు. సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్‌ శరవేగంగా జరుగుతుందని, త్వరలోనే సినిమా నుంచి ట్రైలర్‌ వస్తుందని అభిమానులకు యూనిట్‌ సభ్యులు చెబుతూ వచ్చారు. తీరా చూస్తే సినిమా వాయిదా అనే వార్తలు మొదలు అయ్యాయి. సినిమా విడుదలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు దర్శకుడు ట్రైలర్‌ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. పైగా సెన్సార్‌ కాపీ కూడా సిద్ధం కాలేదని తెలుస్తోంది.

సెన్సార్‌ బోర్డ్‌ ముందుకు వెళ్తే కచ్చితంగా సినిమాను అనుకున్న సమయంకు విడుదల చేస్తారు అనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పటి వరకు వీరమల్లు సినిమా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేయలేదు. దాంతో అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ సమయంలోనే టాలీవుడ్‌కి చెందిన కొందరు ప్రముఖులు, సోషల్‌ మీడియాలో ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన వారు హరిహర వీరమల్లు సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది అంటూ ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ తన పని తాను పూర్తి చేశారు. కానీ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ విషయంలో మేకర్స్ సంతృప్తి చెందడం లేదు. అందుకే వీరమల్లు సినిమా వాయిదా వేసే నిర్ణయానికి వచ్చారనే టాక్‌ వినిపిస్తుంది.

సినిమా ఎక్కువగా ఇండోర్‌లో షూట్‌ చేయడం జరిగింది. కనుక వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ అత్యంత కీలకంగా ఉంటాయి. సినిమాను విడుదల చేయాలనే ఆరాటంలో వీఎఫ్ఎక్స్‌ వర్క్‌ విషయంలో చూసి చూడనట్లు వదిలేస్తే పరువు పోతుంది. పవన్‌ కళ్యాణ్ సినిమాకు ఏ చిన్న డ్యామేజ్‌ జరిగిన అభిమానులు చాలా నిరుత్సాహం వ్యక్తం చేస్తారు. నిర్మాతలు, దర్శకుడిపై విరుచుకు పడుతారు. పైగా బాక్సాఫీస్‌ వద్ద దారుణమైన ఫలితాన్ని చవిచూడాల్సి వస్తుంది. అందుకే కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో వీరమల్లు సినిమాను ఈ వారంలో కాకుండా కాస్త ఆలస్యంగా విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చి ఉంటారు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా విడుదలకు పది రోజుల సమయం కూడా లేదు. ప్రమోషన్ కూడా పెద్దగా చేయలేదు. పాటలు మాత్రమే విడుదల చేసిన మేకర్స్‌ ఇప్పటి వరకు ఇతర ప్రమోషనల్‌ స్టఫ్‌ను విడుదల చేయలేదు. ఆ కారణంగా కూడా సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతుందని తెలుస్తోంది. సినిమాకు సాధ్యం అయినంత వరకు ప్రమోషన్ చేసిన తర్వాత విడుదల చేస్తే ఓపెనింగ్స్ బాగా వస్తాయని మేకర్స్ భావిస్తూ ఉండవచ్చు. అందుకే విడుదల తేదీ విషయంలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అతి త్వరలోనే సినిమా విడుదల వాయిదా విషయాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించి, కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఫ్యాన్స్‌ మాత్రం ఈ బ్యాడ్‌ న్యూస్‌ నిజం కావద్దని బలంగా ప్రార్థనలు చేస్తున్నారు. మరి వారి ప్రార్థనలు సఫలం అయ్యేనా చూడాలి.