అలా జరిగితే 'వీరమల్లు' మేకర్స్ వెతుక్కోవాల్సిందేనా?
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన మూవీ హరిహర వీరమల్లు.
By: Tupaki Desk | 4 Jun 2025 8:31 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన మూవీ హరిహర వీరమల్లు. పీరియాడిక్ యాక్షన్ జోనర్ లో తెరకెక్కిన ఆ సినిమాకు జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం సమర్పణలో దయకరరావు గ్రాండ్ గా సినిమాను నిర్మించారు.
అయితే ఐదేళ్ల క్రితం హరిహర వీరమల్లు మూవీ మొదలైంది. కానీ చాలా ఏళ్లపాటు సెట్స్ పైనే ఉండిపోయింది చిత్రం. డైరెక్టర్ క్రిష్.. సినిమాలోని చాలా భాగాన్ని కంప్లీట్ చేశారు. జనసేన పార్టీ అధినేతగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీ అవ్వడం వల్ల సినిమా షూటింగ్ అలా లేట్ అవుతూనే వచ్చింది.
గత ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల్లో బీజేపీ- టీడీపీ- జనసేన కూటమి విజయం సాధించడంతో పవన్ డిప్యూటీ సాబ్ అయ్యారు. దీంతో తన వర్క్స్ తో బిజీ అయిపోయారు. ప్రజాసేవకు ఎక్కువ సమయం కేటాయించారు. అలా షూటింగ్ మరింత లేట్ అవ్వగా.. ఇంతలో డైరెక్టర్ క్రిష్ హరిహర వీరమల్లు మూవీ నుంచి తప్పుకున్నారు.
దీంతో ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో చిత్రీకరణను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కానీ అవి ఇప్పుడు ఆలస్యమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పటికే మేకర్స్ ప్రకటించినట్లు జూన్ 12వ తేదీన సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యే అవకాశం లేదని జోరుగా ప్రచారం సాగుతోంది.
మరో 10 రోజుల పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగనుందని.. జూన్ లో మరో డేట్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అది జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే జూన్ లో బడా హీరోల సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్స్ ను కన్ఫర్మ్ చేసుకున్నాయి. అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమయ్యాయి.
కాబట్టి ఆయా సినిమాలు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ఇప్పటికే వీరమల్లు వల్ల పలుమార్లు.. పలు సినిమాలు డేట్స్ మార్చుకున్నాయి. అందుకే ఈసారి తమ సినిమాలను పోస్ట్ పోన్ చేయమని డిసైడ్ అయిపోయారట ఆయ మేకర్స్. దీంతో ఇప్పుడు జూన్ 12ను వదిలేస్తే వీరమల్లు మేకర్స్ కొత్త డేట్ ను వెతుకోవాల్సిందేనని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో.. మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.
