Begin typing your search above and press return to search.

క్రిష్ మౌనవృతం ఎందుకు? దాని భావ‌మేమి?

ఆ కార‌ణంగా `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`కు టైమ్ కేటాయించ‌లేక‌పోయారు. నాలుగేళ్లుగా ఓపిక‌గా ఎదురు చూసిన క్రిష్ ఇక ఓపిక న‌శించిపోవ‌డంతో త‌న దారి తాను చూసుకున్నాడు.

By:  Tupaki Desk   |   2 Jun 2025 11:32 PM IST
క్రిష్ మౌనవృతం ఎందుకు? దాని భావ‌మేమి?
X

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న‌తొలి పాన్ ఇండియా మూవీ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. ప‌వ‌న్ న‌టిస్తున్న తొలి జాన‌ప‌ద పీరియాడిక్ ఫిల్మ్ కూడా ఇదే కావ‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆది నుంచి అభిమానుల్లో, సినీ ప్రియుల్లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీంతో ఈ మూవీని మేక‌ర్స్ రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఫ‌స్ట్ పార్ట్‌కు ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి. సెకండ్ పార్ట్‌కు నిర్మాత ఏ.ఎం.ర‌త్నం త‌న‌యుడు జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

క్రిష్ ఫ‌స్ట్ పార్ట్‌కు డైరెక్ష‌న్‌తో పాటు క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించారు. నాలుగేళ్లుగా షూటింగ్ జ‌రుపుకున్న ఈ సినిమా ఎట్ట‌కేల‌కు జూన్ 12న వ‌రల్డ్ వైడ్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌ని టీమ్ ప్రారంభించింది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌గా నిలిచి నాలుగేళ్ల పాటు శ్ర‌మించిన డైరెక్ట‌ర్‌ క్రిష్ ఇప్పుడు సైలెంట్ అయిపోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ మొద‌ల‌య్యాక స‌వ‌న్ క్రియాశీల రాజ‌కీయాల్లో బిజీ అయ్యారు. జ‌న‌సేన పేరుతో పార్టీని స్థాపించి ఏపీ రాజ‌కీయాల్లో కింగ్ మేక‌ర్‌గా నిలిచారు.

ఆ కార‌ణంగా `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`కు టైమ్ కేటాయించ‌లేక‌పోయారు. నాలుగేళ్లుగా ఓపిక‌గా ఎదురు చూసిన క్రిష్ ఇక ఓపిక న‌శించిపోవ‌డంతో త‌న దారి తాను చూసుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుని అనుష్క‌తో త‌న సొంత బ్యాన‌ర్‌లో `ఘాటీ` మూవీని రూపొందించి ఐదు భాష‌ల్లో రిలీజ్‌కు రెడీ చేశాడు. క్రిష్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోగానే ఆ బాధ్య‌త‌ల్ని నిర్మాత త‌న‌యుడు జ్యోతికృష్ణ తీసుకున్నాడు.

అయితే ఇక్క‌డే అస‌లు ప్ర‌శ్న మొద‌లైంది. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ సినిమాని క్రిష్ ఎంత వ‌ర‌కు డైరెక్ట్ చేశాడు? ఏ మేర‌కు వ‌దిలేశాడు? ఏ భాగాన్ని జ్యోతికృష్ణ తెర‌కెక్కించి పూర్తి చేశాడు? సినిమా స‌క్సెస్ అయితే ఆ క్రెడిట్ ఎవ‌రిది? అనే ప్ర‌శ్న‌లు ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు స‌గటు సినీ అభిమానిని వెంటాడుతున్నాయి. ఇదే స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు క్రిష్ కంప్లీట్‌గా సైలెంట్ అయిపోయి త‌న ప‌ని తాను చేసుకుపోతుండ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

అనుష్క‌తో రూపొందించిన `ఘాటీ` రిలీజ్ ప‌నుల్లో బిజీగా ఉన్న క్రిష్ ప‌బ్లిసిటీ కోసం ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం లేదు. అంతే కాకుండా ఎక్క‌డా `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` గురించి మాట్లాడ‌టం లేదు. ఈ సైలెన్స్‌కి సినిమా రిలీజ్ త‌రువాత బ్రేక్ ఇచ్చి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని బ‌య‌ట‌పెడ‌తారేమో అని అంతా ఎదురు చూస్తున్నారు. గ‌తంలో `మ‌ణిక‌ర్ణిక‌` విష‌యంలోనూ క్రిష్ ప‌క్క‌కు త‌ప్నుకోవ‌డం, డైరెక్ట‌ర్ ప‌గ్గాల్ని కంగ‌న తీసుకోవ‌డం, క్రిష్‌ని రెండ‌వ డైరెక్ట‌ర్‌గా పేర్కొన‌డంతో సినిమా రిలీజ్ త‌రువాత క్రిష్ బ్లాస్ట్ అయ్యాడు. కంగ‌న త‌న‌తో ఎలా బిహేవ్ చేసిందో, తాను ఎందుకు బ‌య‌టికి రావాల్సి వ‌చ్చిందో వెల్ల‌డించి షాక్ ఇచ్చాడు. హ‌రి హ‌ర విష‌యంలోనూ మ‌ణిక‌ర్ణిక ఎపిసోడ్ రిపీట్ అవుతుందా? అనేది వేచి చూడాల్సిందే.