హరిహర వీరమల్లు.. ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఆలస్యం గత కొన్నేళ్లుగా అభిమానులను నిరాశపరిచింది
By: Tupaki Desk | 7 May 2025 11:47 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఆలస్యం గత కొన్నేళ్లుగా అభిమానులను నిరాశపరిచింది. 2020లో మొదలైన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, కోవిడ్ మహమ్మారి, పవన్ రాజకీయ బాధ్యతల కారణంగా ఎన్నోసార్లు వాయిదా పడింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. క్రిష్ జగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో సాగుతుంది.
ఫైనల్ గా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ తన షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఐదు రోజుల్లో ముగియాల్సిన వర్క్‌ను కేవలం రెండు రోజుల్లోనే ఫినిష్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వేగంతో సినిమా నిర్మాణం ముగిసినట్లు టీమ్ ప్రకటించింది. ఈ సినిమా కోసం ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, నిధి అగర్వాల్, బాబీ డియోల్, నర్గీస్ ఫాఖ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏదేమైనా ఫైనల్ గా షూటింగ్ వార్త అభిమానుల్లో జోష్ నింపింది.
మొదట సినిమాను సమ్మర్ మధ్యలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. మే 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా, అది కుదరలేదు. ఆ తర్వాత మే 30న రిలీజ్ చేయాలని భావించినా, ఆ డేట్ కూడా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు జూన్‌లో కచ్చితంగా రిలీజ్ చేయాలని టీమ్ ఫిక్స్ అయింది. ఈ సినిమా సమ్మర్ ఎండింగ్ లో అభిమానులకు పెద్ద ట్రీట్‌గా నిలవనుంది.
ప్రస్తుతం నిర్మాత ఎ.ఎం. రత్నం ప్లాన్ ప్రకారం, సినిమా రిలీజ్ డేట్ జూన్ 12గా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇదివరకే ఎప్పటికప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేసిన టీమ్, ఇప్పుడు పవన్ డబ్బింగ్ చెప్పే పనిని పూర్తి చేస్తే, జెట్ స్పీడ్‌లో మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ అవుతుందని అంటున్నారు.
ఈ సినిమా కోసం భారీ సెట్స్, VFX వర్క్ ఆడియన్స్‌ను ఆకర్షించేలా ఉంటాయట. రానున్న రోజుల్లో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగనున్నాయి. కొత్త సాంగ్స్, మరికొన్ని టీజర్స్, రెండు ట్రైలర్స్‌తో ప్రమోషనల్ ప్లాన్ కొనసాగనుంది. ఈ సినిమా పవన్ ఫ్యాన్స్‌కు జూన్ 12న పెద్ద పండగ కాబోతుంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
