వీరమల్లు పరాక్రమణ జూన్ 12 నుంచా!
ఈ నేపథ్యంలో తాజాగా బుక్ మై షోలో కొత్త డేట్ వైరల్ అవుతుంది. వీరమల్లుని జూన్ 12న రిలీజ్ చేస్తున్నట్లు రివీల్ చేసింది.
By: Tupaki Desk | 8 May 2025 9:51 AMపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న `హరిహర వీరమల్లు` ఇప్పటికి ఎన్నిసార్లు వాయిదా పడిందో లెక్కలేదు. రిలీజ్ డేట్ చెప్పడం...సడెన్ గా వాయిదా వేడయం. ఏడాది కాలంగా ఇదే తంతు కనిపిస్తుంది. చివరిగా మే 9న రిలీజ్ అంటూ మరో తేదీ ప్రకటించారు. కానీ పవన్ అప్పటికి పూర్తి చేయాల్సిన పార్ట్ మిగిలిపోవడంతో మళ్లీ వాయిదా తప్పదని తేలిపోయింది. అయితే ఇటీవలే పవన్ రెండు రోజుల పెండింగ్ షూటింగ్ ని ముగించిన సంగతి తెలిసిందే.
దీంతో ఈసారి రిలీజ్ తేది ఎప్పుడు ప్రకటించడమే తరువాయి ప్రేక్షకుల ముందుకొచ్చేయడం పక్కా అని అంతా ఫిక్సైపోయారు. దీంతో రిలీజ్ తేదీ ఎప్పుడా? అని అంతా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. మేకర్స్ కూడా రిలీజ్ ను ఊరిస్తూ ఇక రిలీజ్ చేయడమే అంటూ వ్యాఖ్యలు చేయడం అంతకంతకు క్యూరియాసిటీ పెరిగిపోతుంది. కానీ మేకర్స్ ఇంతవరకూ రిలీజ్ తేదీపై క్లారిటీ ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా బుక్ మై షోలో కొత్త డేట్ వైరల్ అవుతుంది. వీరమల్లుని జూన్ 12న రిలీజ్ చేస్తున్నట్లు రివీల్ చేసింది. మరి ఇది నిజమా? అబద్దామా? అన్నది తేల్చా ల్సింది మేకర్స్. వాళ్లు అధికారికంగా ఇంకా ఎలాంటి రిలీజ్ తేదీ ఇవ్వలేదు. మరి ఈ తేదీ విషయంలో మేకర్స్ ఆలోచన చేస్తున్నట్లుగా లీక్ రావడంతో బుక్ మై షో ఇలా లీక్ చేసిందా? లేక మేకర్స్ హింట్ ఇచ్చారా? అన్నది తేలాలి.
ప్రస్తుతం సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చిత్రీకరణ పూర్తయినంత వరకూ సీజీ పూర్తయింది. కానీ పవన్ రెండు రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఈ మద్యనే పూర్తి చేయడంతో దానికి సంబంధించిన పనుల్లో టెక్నికల్ టీమ్ బిజీ అయింది. అది ఓ కొలిక్కి రాగానే రిలీజ్ తేదిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.