వీరమల్లుతో వెలిగిన బుర్జ్ ఖలీఫా
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫాపై స్క్రీనింగ్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.
By: Tupaki Desk | 17 July 2025 3:42 PM ISTపవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తెలుగుతో పాటు, తమిళ్, హిందీ ఇతర భాషల్లోనూ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదు అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ షూటింగ్ పూర్తి చేయడమే గొప్ప విషయం అయింది. అలాంటిది ఆయన ప్రమోషన్స్‌కు హాజరు అవుతాడా అంటే ఖచ్చితంగా డౌటే అంటున్నారు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అయినా ఆయన వస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరమల్లు సినిమాకు సోషల్ మీడియాలో అభిమానులు ప్రచారం చేస్తున్నారు.
దర్శకుడు జ్యోతికృష్ణ మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు, నిర్మాత ఎఎం రత్నం సైతం సినిమా ప్రమోషన్స్‌కు ప్రయత్నాలు చేస్తున్నాడు. హీరోయిన్‌గా నటించిన నిధి అగర్వాల్‌ను ముందు పెట్టి ప్రచారం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి వీరమల్లు సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫాపై స్క్రీనింగ్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. బుర్జ్ ఖలీఫా పై అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్, సెలబ్రిటీల ఫోటోలు, ఇతరు ముఖ్య ఘట్టాలను స్క్రీనింగ్ చేయడం మనం చూస్తూ ఉంటాం.
హరి హర వీరమల్లు సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో అక్కడ ప్రదర్శించడం అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా పబ్లిసిటీకి ఇది దోహద పడుతుంది. ఇప్పటికే సినిమా ట్రైలర్‌కి వచ్చిన పాజిటివ్ బజ్ నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతకు ముందు వరకు ఈ సినిమా ఎలా ఉంటుందో అని పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వారే ట్రైలర్ అనుకున్నంత బ్యాడ్‌గా ఏమీ లేదు. కనుక సినిమా కూడా బాగానే ఉంటుందేమో అని అంటున్నారు. ఈ సినిమా పబ్లిసిటీ ఇంకాస్త జోరు పెంచితే, ఇతర సెలబ్రిటీలను అయినా ముందుకు తీసుకు వస్తే తప్పకుండా సినిమా భారీ వసూళ్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా చాలా ఆలస్యం కావడంతో ఆయన తప్పకున్నాడు. పవన్ డేట్లు కుదరక పోవడంతో క్రిష్ తప్పకున్నాడు. క్రిష్ మొదలు పెట్టిన వీరమల్లు సినిమాను నిర్మాత ఎఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తి చేశాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిధి అగర్వాల్ నటించిన విషయం తెల్సిందే. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇప్పటి వరకు వచ్చిన పాటలు జనాల్లో పెద్దగా ఆధరణ దక్కించుకోలేదు. కానీ అవే పాటలు సినిమా విడుదల తర్వాత పాపులర్ అవుతాయనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవిని తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది.
