Begin typing your search above and press return to search.

వీరమల్లు కోసం వచ్చేది వీళ్లేనా..?

పవన్‌ కళ్యాణ్‌ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమాను జులై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

By:  Tupaki Desk   |   18 July 2025 3:33 PM IST
వీరమల్లు కోసం వచ్చేది వీళ్లేనా..?
X

పవన్‌ కళ్యాణ్‌ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమాను జులై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దాదాపు నాలుగు ఏళ్లుగా ఈ సినిమా నలుగుతూ వస్తోంది. దర్శకుడు క్రిస్ ఈ సినిమాను మొదలు పెట్టడానికి సమయం పడుతుందనే ఉద్దేశంతో మరో సినిమాను చేశాడు, ఈ సినిమా ఆలస్యం అవుతుందని తప్పుకుని మరో సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా ఏ స్థాయిలో ఆలస్యం అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎఎం రత్నం నిర్మించిన ఈ సినిమాను క్రిష్ మొదలు పెడితే జ్యోతికృష్ణ పూర్తి చేశాడు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జులై 21న నిర్వహించబోతున్నారు.

జులై 21, సాయంత్ర 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో నిర్వహించబోతున్న హరి హర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పలువురు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. గత నెలలో సినిమా విడుదల తేదీ అనుకున్న సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్‌ చిరంజీవి వస్తారనే ప్రచారం జరిగింది. కానీ సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఆలస్యం కావడంతో ఈ నెలకు వాయిదా వేశారు. కానీ ఈసారి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో లేకపోవడం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాలేక పోతున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇప్పటి వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరు కాబోతున్న వారి వివరాలను మేకర్స్‌ అధికారికంగా ప్రకటించలేదు. కానీ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్‌ కళ్యాణ్ హీరోగా హాజరు కానుండగా ముఖ్య అతిథిగా త్రివిక్రమ్‌ హాజరు కాబోతున్నాడు. పవన్‌ కు అత్యంత ఆప్తుడిగా పేరున్న త్రివిక్రమ్‌ ఈ కార్యక్రమంకు హాజరు కావడం దాదాపు కన్ఫర్మ్‌. ఇక రెండు రాష్ట్రాలకు చెందిన సినిమాటోగ్రఫీ మంత్రులు హాజరు అయ్యే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతే కాకుండా మెగా ఫ్యామిలీకి చెందిన ఒక హీరో సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్‌ కళ్యాణ్ టికెట్ల రేట్లు, థియేటర్ల ఇష్యూ, తెలుగు ప్రభుత్వాలు-తెలుగు సినిమా ఇండస్ట్రీ మధ్య ఉన్న రిలేషన్ గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం చేయాల్సిన కృషిని కూడా ఈ కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్‌ సూచించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. హీరోయిన్‌గా నటించిన నిధి అగర్వాల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే క్రిష్ ఈ కార్యక్రమంకు హాజరు అయ్యేనా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. సినిమాను పూర్తి చేసిన దర్శకుడు జ్యోతికృష్ణ ఇప్పటికే పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ పూర్తి చేశాడు, కనుక ఆయన స్టేజ్‌ పై ఉండే అవకాశాలు ఉన్నాయి. నిర్మాత ఎఎం రత్నం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉండబోతున్నారు.