Begin typing your search above and press return to search.

వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. 3 రాష్ట్రాల మంత్రులు వస్తున్నారా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో రూపొందుతున్న హరిహర వీరమల్లు రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 July 2025 6:32 PM IST
వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. 3 రాష్ట్రాల మంత్రులు వస్తున్నారా?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో రూపొందుతున్న హరిహర వీరమల్లు రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఆ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.

అనేక కారణాల వల్ల ఐదేళ్ల పాటు సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు మూవీ.. ఇప్పుడు జులై 24వ తేదీన వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను రిలీజ్ చేస్తున్నారు. వరుస అప్డేట్స్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.

ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. జులై 21వ తేదీన హైదరాబాద్ లో ముందస్తు విడుదల వేడుక జరగనుంది. అందుకు గాను తాజాగా అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్. శిల్పకళావేదికలో 21వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి కార్యక్రమం జరగనుందని వెల్లడించారు. పవర్ ఫుల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

అందులో గుర్రాన్ని స్వారీ చేస్తూ పవన్ కళ్యాణ్ వేరే లెవెల్ లో కనిపించారు. ఆ తర్వాత యుద్ధభూమి వేచి ఉంది.. కానీ ముందుగా, జులై 21న జరగనున్న వేడుక రోజు జెండాలను ఎగురవేద్దామంటూ రాసుకొచ్చారు. సినిమా రిలీజ్ కు మరో వారం రోజులే ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మూడు వేర్వేరు రాష్ట్రాల మంత్రులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు పెద్ద సంఖ్యలో వచ్చి పవన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తారని ప్రచారం జరుగుతోంది. వారితో పాటు తెలంగాణకు చెందిన కొంతమంది మంత్రులు కూడా ప్రత్యేక కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం.

ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వానికి చెందిన మంత్రులు కూడా కార్యక్రమానికి హాజరవుతారని కూడా టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఇప్పటి వరకు హరి హర వీరమల్లు ప్రమోషన్లలో పవన్ కళ్యాణ్‌ కనిపించలేదు. కానీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ఆయన అందరి దృష్టిని ఆకర్షించడం ఖాయం. ఆయన స్పీచ్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.