బెటర్ అవుట్‌పుట్ కోసమే వాయిదా
జూన్ 12న వీరమల్లు సినిమా రిలీజ్ కావడం లేదని, ఫ్యాన్స్ ఈ సినిమాకు ఇస్తున్న మద్దతు ఎంతో విలువైందని ప్రకటిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపింది.
By: Tupaki Desk | 6 Jun 2025 2:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ వాయిదా గురించి గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వార్తలొస్తుండగా, ఇప్పుడా విషయాన్ని చిత్ర నిర్మాతలు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. జూన్ 12న వీరమల్లు సినిమా రిలీజ్ కావడం లేదని, ఫ్యాన్స్ ఈ సినిమాకు ఇస్తున్న మద్దతు ఎంతో విలువైందని ప్రకటిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపింది.
బెటర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ కోసమే వీరమల్లు సినిమా లేటవుతుందని తెలిపిన మేకర్స్, సినిమాను ముందు చెప్పిన రిలీజ్ డేట్ కు రిలీజ్ చేయాలని నిరంతంగా ప్రయత్నించినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ కు ఇంకాస్త టైమ్ పడుతుందని, ఈ డెసిషన్ కష్టంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ లెగసీని దృష్టిలో పెట్టుకుని, ప్రతీ ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా ఉండటం కోసమే తాము సినిమాను వాయిదా వేస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.
అయితే వాయిదా క్రమంలో వీరమల్లు సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని చెప్పారు. సోషల్ మీడియాలో సినిమా గురించి, కొత్త రిలీజ్ డేట్ గురించి ఎన్నో వార్తలొస్తున్నాయని వాటన్నింటినీ నమ్మొద్దని, అఫీషియల్ ఛానెల్స్ ద్వారా తామే సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్‌ను అయినా అందిస్తామని మేకర్స్ స్పష్టం చేశారు.
దీంతో పాటూ హరి హర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ రెడీగా ఉందని, కొత్త రిలీజ్ డేట్ తో పాటూ దాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఎంతో కాలంగా సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ను ట్రైలర్, వీరమల్లు ప్రపంచంలోకి తీసుకెళ్తుందని తెలిపారు. మొత్తానికి వీరమల్లు నుంచి మంచి కంటెంట్ రాబోతుందని, ఫ్యాన్స్ దాని కోసం వెయిట్ చేస్తూ ఉండాలని చిత్ర యూనిట్ కోరింది. క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాబీ డియోల్ విలన్ గా నటించాడు.
