హరిహర వీరమల్లులో రామాయణ ధర్మం
రామాయణంలోని రాముడు అయోధ్య నుంచి లంక చేరే మార్గంలో అనేక ప్రాంతాల్లో చేసిన మంచి పనులు ‘‘లాండ్ మార్క్’’ మువ్మెంట్స్‌గా నిలిచాయి.
By: Tupaki Desk | 26 July 2025 10:41 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హరి హర వీర మల్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. మొఘల్ పాలకులు హిందూ ఆలయాలను ఎలా ధ్వంసం చేశారనే నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. సినిమా కథతో పాటు పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, “వేద గ్రంథాలను ధ్వంసం చేసిన ఆ కాలంలో వీర మల్లు అన్నింటికీ ఎదురుతెచ్చాడు. ఆలయంలో పెరిగిన ఇతడు చిన్నప్పటి నుంచే వేదాలు, ధర్మాన్ని లోతుగా అధ్యయనం చేశాడు. వేద పండితుడిగా మారిన ఇతడు కాలక్రమేణా గొప్ప శక్తిగా ఎదిగాడు” అని వివరించారు.
వాస్తు శాస్త్రంలోని ఐదు మూలకాలు.. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం.. వీటి ప్రాముఖ్యతను వేదాల ద్వారా వీర మల్లు తన జీవన విధానంలో కలిపాడని దర్శకుడు వివరించారు. అతడి ప్రతిభ, ముందుగానే విషయాలను గ్రహించే సామర్థ్యం మరెవరికి ఉండదు. ఉదాహరణగా, కొండ ప్రాంతంలో గల్ఫాం ఖాన్‌ను ప్రమాదం నుంచి రక్షించడం, వర్షాభావంతో బాధపడుతున్న గ్రామంలో వరుణ యాగం చేయించి వర్షాన్ని తీసుకురావడం వంటి కీలక ఘట్టాలు సినిమాలో కనిపిస్తాయి. జంతువులపై ప్రేమ, అహింసకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా వీర మల్లుకు ప్రత్యేకత.
రామాయణంలోని రాముడు అయోధ్య నుంచి లంక చేరే మార్గంలో అనేక ప్రాంతాల్లో చేసిన మంచి పనులు ‘‘లాండ్ మార్క్’’ మువ్మెంట్స్‌గా నిలిచాయి. చిత్రకూటం, పంచవటి, క్రౌంచ అరణ్యం, మతంగా ఆశ్రమం, ఋష్యమూక వంటి ప్రదేశాల్లో రాముడు చూపిన ధర్మాన్ని దర్శకుడు సినిమాలో వీర మల్లులో హైలెట్ చేశారు. గోల్కొండ నుంచి ఢిల్లీ వరకు వీర మల్లు చేసే యాత్రలో ఎదురైన సంఘటనలన్నీ వేద ధర్మాన్ని నిలబెట్టే విధంగా చూపారు.
ఈ సినిమాను చూసినపుడు వీర మల్లును రాముడి యాత్రతో పోల్చుకోవచ్చు. అతడు చేసే ప్రయాణంలో ఎదురైన ప్రతి పరిణామం, చేసిన మంచి పనులు ధర్మానికి మార్గదర్శిగా నిలుస్తాయి. డైరెక్టర్ జ్యోతి కృష్ణ మైథాలజీ, చరిత్ర రెండింటినీ కలిపి కథను అద్భుతంగా నడిపించారు. ఔరంగజేబుతో చివరి ఘట్టంలో జరిగే ఘర్షణను ప్రకృతి సహాయంతో మలచారు.
క్లైమాక్స్‌లో భారీ తుఫాను రావడం, కథను అద్భుతంగా ముగించడం ద్వారా దర్శకుడు పార్ట్ 2కి బలం ఇచ్చారు. ప్రేక్షకులకు సినిమా అనుభూతిని మెరుగుపరచేందుకు గ్రాఫిక్స్ అప్‌గ్రేడ్ చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ బుకింగ్స్ బలంగా ఉండటంతో వీకెండ్ వసూళ్లు సినిమా హైప్‌ను పెంచుతున్నాయి. మొత్తానికి ‘‘హరి హర వీర మల్లు’’ చిత్రం సనాతన ధర్మాన్ని రామాయణం ద్వారా ప్రేరణగా తీసుకుని, పవన్ కళ్యాణ్ పాత్రలోని ధైర్యాన్ని, వేదాల విలువలను అందరికీ చేరువచేసింది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చిన చిత్రంగా నిలిచింది.
