హరిహర డే 1 వసూళ్లలో పవన్ మార్క్.. దేశంలోనే టాప్ 2లో
తొలి రోజు వసూళ్లలో పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్ కనిపించింది. ఫస్ట్ డే హరిహర మంచి వసూళ్లనే అందుకుంది.
By: Tupaki Desk | 26 July 2025 3:10 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో థియేటర్లకు మళ్లీ కల వచ్చింది. ఆయన లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా జూలై 24 న గ్రాండ్ గా రిలీజైంది. అభిమానుల కోసం విడుదలకు ముందురోజు రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ కూడా పడ్డాయి. పవన్ కళ్యాణ్ సినిమా దాదాపు మూడేళ్ల తర్వాత రావడంతో ఫ్యాన్స్ పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు.
సినిమాకు ముందు ఆయనే స్వయంగా ప్రమోషన్స్ చేయడం, వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఒక్కసారిగా బజ్ పెరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ జోరు కనిపిచింది. ప్రీమియర్, ఓపెనింగ్ డే థియేటర్లు ఫుల్ ఆక్యుపెన్సీతో రన్ అయ్యియి. ఇక ప్రీమియర్ షోలు, డే 1 కలిపి ఓపెనింగ్ కలెక్షన్ల లెక్కలు బయటకు వచ్చాయి.
తొలి రోజు వసూళ్లలో పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్ కనిపించింది. ఫస్ట్ డే హరిహర మంచి వసూళ్లనే అందుకుంది. దీంతో ఆయన కెరీర్ లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా హరిహర వీరమల్లు నిలిచింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మొత్తం రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఈ ఏడాది భారత్ లోనే అత్యధిక ఓపెనింగ్ గ్రాస్ వసూల్ చేసిన రెండో సినిమాగా నిలిచింది. మరి ఈ లిస్ట్ లో టాప్ లో ఏ సినిమా ఉంది. అలాగే టాప్ 10 జాబితాలో ఉన్న సినిమాలేంటో చూద్దాం.
2025లో డే 1 అత్యధిక గ్రాస్ కలెక్షన్లు వసూల్ చేసిన భారతీయ సినిమాలు
గేమ్ ఛేంజర్ - రూ. 92.25 కోట్లు
హరిహర వీరమల్లు - రూ. 70 కోట్లు
ఎంపురాన్- రూ. 67.35 కోట్లు
డాకు మహారాజ్- రూ. 51.85 కోట్లు
గుడ్ బ్యాడ్ అగ్లీ- రూ. 51.50 కోట్లు
ఛావా- 47.55 రూ. కోట్లు
విదాముయార్చి- రూ. 48.45 కోట్లు
సికిందర్- రూ. 41.60 కోట్లు
హిట్ 3- రూ. 40.80 కోట్లు
సంక్రాంతికి వస్తున్నాం- రూ. 40.05 కోట్లు
కాగా, టాప్ 10లో ఐదు తెలుగు సినిమాలే ఉండడం విశేషం.
పీరియాడికల్ డ్రామాగా క్రిష్ జాగర్లమూడి సినిమా ప్రారంభించారు. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా జ్యోతి కృష్ణ తెరకెక్కించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందించగా, ఏ ఎం రత్నం నిర్మించారు.
