Begin typing your search above and press return to search.

నాల్గ‌వ సింగానికి ముహూర్తం పెట్టేస్తున్నారా?

సింహం పంజా విసిరి ఎనిమిదేళ్ల‌వుతుంది. చివ‌రిగా సింగం ప్రాంచైజీ నుంచి థ‌ర్డ్ పార్ట్ 2017 లో రిలీజ్ అయింది.

By:  Srikanth Kontham   |   2 March 2026 11:00 PM IST
నాల్గ‌వ సింగానికి ముహూర్తం పెట్టేస్తున్నారా?
X

సింహం పంజా విసిరి ఎనిమిదేళ్ల‌వుతుంది. చివ‌రిగా సింగం ప్రాంచైజీ నుంచి థ‌ర్డ్ పార్ట్ 2017 లో రిలీజ్ అయింది. అయితే తొలి రెండు పంజా దెబ్బ‌లు కంటే? థ‌ర్డ్ పంచ్ అంత ప‌వ‌ర్ పుల్ గా లేదు. రోటీన్ చిత్రంగా తేలిపోయింది. కానీ యాక్ష‌న్ స్పీడ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. దీంతో సింగం ప్రాంచైజీ పై బ‌జ్ ఏమాత్రం స‌న్న‌గిల్ల‌లేదు. సింగం 4 ఎప్పుడు? అంటూ ఎప్ప‌టిక‌ప్పుడు ఫాలోవ‌ర్స్ అడుగుతూనే ఉన్నారు. ఈ ఫాలో అప్ ని ద‌ర్శ‌కుడు హ‌రి ఎంత మాత్రం లైట్ తీసుకోలేదు. త‌న‌వైపు నుంచి ఉన్న స‌మాచారాన్ని అందిస్తూనే ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సింగం 4 స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని ధృవీకరించారు.

సూర్య కూడా సింగం పాత్ర విష‌యంలో ఎంత మాత్రం బోర్ ఫీల్ అవ్వ‌లేద‌ని..అంతే ఎగ్జైట్ మెంట్ తో ప‌ని చేయ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే ఇద్ద‌రు వేర్వేరు సినిమాల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ కు స‌మ‌యం కేటాయించ‌లేదు. హ‌రి కంటే సూర్య బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం సూర్య క‌మిట్ అయిన రెండు మూడు చిత్రాలున్నాయి. వాటిని సూర్తి చేసిన త‌ర్వాత సింగం 4ని ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ మ‌ద్య‌లోనే హ‌రి మ‌రో సినిమా డైరెక్ట్ చేస్తాడు. అయితే సింగం 4 ప్రాథమిక కథను ఇప్ప‌టికే సిద్ధం చేశారు.

మొద‌టి భాగంలో లోక‌ల్ మాఫియా నేప‌థ్యంలో క‌థ న‌డప‌గా రెండు..మూడు భాగాల్లో ఇంట‌ర్నేష‌న‌ల్ డ్ర‌గ్ మాఫియాను తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో నాల్గ‌వ భాగంలో ఎలాంటి పాయింట్ ను ఎంచుకున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అలాగే క్యాస్టింగ్ కూడా కీల‌క‌మే. ఈసారి కొత్త పాత్ర‌ల్ని తీసుకోవాల‌ని హ‌రి భావిస్తున్నాడు. రెండు .మూడు భాగాల‌కు కొన‌సాగింపు పాత్ర‌లు ఉన్నా? వాటికంటే తీసుకునే కొత్త పాత్ర‌ల‌కే పెద్ద పీట వేయాల‌ని భావిస్తున్నాడుట‌. అలాగే డ్ర‌గ్ మాఫియాకు భిన్నంగా ఓ కొత్త పాయింట్ తీసుకుంటున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

ఈసారి ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం పాన్ ఇండియాలో సౌత్ సినిమాలు రిలీజ్ అవుతోన్న త‌రుణంలో? త‌న‌దైన మార్క్ కాఫ్ స్టోరీని పాన్ ఇండియాలో వ‌దిలితే ఎలా ఉంటుందో చూడ‌లని హ‌రి ఆస‌క్తిగా ఉన్నాడు. అయితే అందుకు సూర్య అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. సూర్య తొలి పాన్ ఇండియా చిత్రం కంగువ దారుణంగా ఫెయిలైన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి సూర్య రీజ‌న‌ల్ మార్కెట్ లోనే సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియాలో సినిమా చేస్తే గ‌నుక అది బ్లాక్ బ‌స్ట‌ర్ మాత్ర‌మే అవ్వాల‌న్న‌ది అత‌డి అభిప్రాయం. సింగం 4 స్క్రిప్ట్ పై సూర్య అంత కాన్పిడెంట్ గా ఉంటే గ‌నుక తిరుగుండ‌దు.